కోలీవుడ్‌లో మురుగదాస్ అంటే క్రేజీ డైరెక్టర్. తెలుగు ప్రేక్షకులకు మురుగదాస్ సినిమాలంటే పిచ్చి. కానీ స్పైడర్ సినిమాతో తన ఇమేజ్ కి మురుగదాస్ డ్యామేజ్ చేసుకున్నాడు. తుపాకీ, గజినీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు పిచ్చ క్రేజ్. కానీ మురుగదాస్ నేరుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. స్పైడర్ సినిమాతో మురుగదాస్ అంటేనే హీరోలు కాదు.. తెలుగు ప్రేక్షకులే కంగారు పడుతున్నారు. ఎంత గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ అయినా... ఒకే ఒక్క ప్లాప్ తో కనుమరుగయ్యే రోజుల్లో.. మురుగదాస్ క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. కారణం తమిళనాట స్టార్ హీరోలు మురుగదాస్ మీద మంచి నమ్మకం పెట్టుకోబట్టి వరసగా ఆయనకు సినిమాలొస్తున్నాయి.
ఇక తెలుగులో స్పైడర్ తర్వాత మురుగదాస్ తాజాగా మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ వినబడుతుంది. అది కూడా మెగా హీరో అల్లు అర్జున్‌తో అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న అల్లు అర్జున్, సుకుమార్ తో ఒక సినిమా, వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమాలు కమిట్ అయ్యాడు. ఇక ఎప్పటినుండో తెలుగు, తమిళంలో ఓ సినిమా చెయ్యాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. అందుకే మురుగదాస్... రజినీకాంత్ తో చేసే దర్బార్ పూర్తి కాగానే.. అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమాకి ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి మురుగదాస్ కి మధ్య కథ చర్చలు మొదలైనట్టుగా టాక్.