Advertisementt

‘నా పేరు రాజా’ షూటింగ్ వివరాలివే!

Mon 02nd Sep 2019 03:23 PM
naa peru raja movie,shooting update,naa peru raaja movie  ‘నా పేరు రాజా’ షూటింగ్ వివరాలివే!
Naa Peru Raja Movie Shooting Update ‘నా పేరు రాజా’ షూటింగ్ వివరాలివే!
Advertisement
Ads by CJ

అమోఘ్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా ‘తిరుగుబోతు’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన యాక్షన్ స్టార్ రాజ్ సూర్యన్ హీరోగా ఈసారీ మూడు డైనమిక్ మరియు డిఫరెంట్ పాత్రలు, గెటప్‌లతో వస్తోన్న చిత్రం ‘నా పేరు రాజా’. ‘ఈడో రకం... డెఫినెట్లీ డిఫరెంట్’ అనేది ట్యాగ్ లైన్. ఇక ఇందులో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఆకర్షిక మరియు హాట్ మోడల్ నస్రీన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ చిత్రం ద్వారా ప్రభు సూర్య, ఆయుశ్రీ, ఇరాన్ సూపర్ మోడల్ అవ సఫాయి, ఆరాధ్య నటీనటులుగా పరిచయమవుతున్నారు. 

ఈ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘ఆంధ్ర-తెలంగాణ, కేరళ, కర్ణాటకలో దాదాపు 65 రోజులలో షూటింగ్ పూర్తి చేసాము. ఇక ఇందులో సెన్సేషనల్ టైటిల్ సాంగ్ ‘రాజా రాజా మన్మధ రాజా.. ఆజా ఆజా నా రాజా’’ సాంగ్‌ను కొరియోగ్రాఫర్ నగేష్ హాలీవుడ్ స్టైల్‌లో చిత్రీకరించారు. సాహితీ రాసిన ఈ పాటను మోహనా భోగరాజు పాడారు. కంటెంట్ నచ్చి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాం. ఇక అక్టోబర్‌లో ఆడియో రిలీజ్ చేసి సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 

Naa Peru Raja Movie Shooting Update:

Naa Peru Raja Movie Shooting completed and Release in November 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ