ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో చిత్రం నిన్నే రిలీజ్ అయింది. స్ట్రాంగ్ గా ఉన్న ఈ మూవీ డివైడ్ టాక్‌తో మొదటి రోజు మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ కాలేకపోయింది. నిజానికి మొదటి రోజే 10లక్షల డాలర్ల వసూళ్లంటే మాములు విషయం కాదు. కానీ సాహో మాత్రం ఆ దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది. సాహో చిత్రం ప్రీమియర్స్ తో కలుపుకొని ఓవర్సీస్ లో 9 లక్షల 15వేల డాలర్లు వచ్చాయి. అలా జస్ట్ మిస్ అయింది సాహో.
ఓవర్సీస్ లో మొదటి రోజు వసూళ్లలో బాహుబలి-2దే రికార్డు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, బాహుబలి-1, ఖైదీ నంబర్-150 సినిమాలున్నాయి. ఇవ్వన్ని మొదటి రోజే మిలియన్ మార్క్ గ్రాస్ అందుకున్నాయి. కానీ సాహో చిత్రం మాత్రం ఆ ఫీట్ అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ మూవీ నెగటివ్ టాక్ రావడం బాగా మైనస్ అయింది.