Advertisementt

‘బాహుబలి’ లెక్క లేరు.. ‘సాహో’ లెక్క వేరు?

Sun 01st Sep 2019 02:11 PM
saaho,baahubali,prabhas,promotion,rajamouli,sujeeth,uv crations,prabhas saaho  ‘బాహుబలి’ లెక్క లేరు.. ‘సాహో’ లెక్క వేరు?
Saaho Result at Box Office ‘బాహుబలి’ లెక్క లేరు.. ‘సాహో’ లెక్క వేరు?
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా నేషనల్ వైడ్‌గా కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా విడుదలైనా.. ఆ సినిమా క్రేజ్ వేరు. మొదటి నుండి దర్శకుడు రాజమౌళి బాహుబలి ప్రమోషన్స్ విషయంలో ఓ స్ట్రాటజీని మెయింటింగ్ చేసాడు. అందుకే బాహుబలి సినిమా లుక్స్ రివీల్ అయిన దగ్గరనుండి సినిమా మీద విపరీతమైన హైప్ వచ్చింది. అలాగే సినిమాలోని పాత్రలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. రాజమౌళి బాహుబలిని హిందీలో దింపేటప్పుడు.. చాలా ప్లానింగ్‌తో అక్కడి మార్కెట్ ని సెట్ చేసాడు. అందుకే సినిమాకి ఎక్కడా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. హీరో ప్రభాస్ తో పాటుగా రాజమౌళి బాహుబలి ప్రమోషన్స్ ని పక్కా ప్లానింగ్ తో నిర్వహించాడు. ఇక సినిమా భారీగా తెరకెక్కినా.. బాహుబలి అద్భుతమైన కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రభాస్ కూడా ఆరడుగుల ఆజానుబాహుడిలా.. యుద్దాలు చెయ్యడం, అనుష్క తో రొమాంటిక్ లవ్ ట్రాక్, తల్లితో, భార్యతో ఎమోషనల్ ట్రాక్ లో ఇరగదీసాడు. ఇక బాహుబలి పాటల విషయమూ అంతే.. ఒక్కో పాట ఒక్కో అద్భుతం.

కానీ ప్రభాస్ సాహో చిత్రాన్ని ఓ కుర్ర దర్శకుడు తీస్తున్నాడు అంటే అతని స్టామినా మీద మొదటి నుండి డౌట్. అలాగే కేవలం యాక్షన్ నే నమ్ముకుని సినిమా చెయ్యడం అంటే.. ఈ కాలంలో రిస్క్ తో కూడుకున్నదే. కథ లేకపోయినా.. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో సినిమాని నడిపెయవచ్చు. కానీ సాహో స్క్రీన్‌ప్లే చాలా గందరగోళంగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా డల్‌గా కనిపిస్తాడు. చాలా లేజీ గా కనిపిస్తాడు. హీరోయిన్ తో లవ్ ట్రాక్ లో ప్రభాస్ తేలిపోయాడు. బాహుబలి లో ప్రభాస్ నటనతో పోలిస్తే.. సాహో లో ప్రభాస్ నటన 70 పర్సెంట్ కూడా లేదు. ఇక యాక్షన్ మీద పెట్టిన శ్రద్ద పాత్రల మీద పెట్టలేదు. చిన్న చిన్న విషయాలకు డబ్బు నీళ్లలా వెదజల్లారు. ఆ విషయం సినిమాలోని ప్రతి సీన్ లో తెలుస్తుంది. 

ఇక ప్రమోషన్స్ ని కూడా చాలా లేట్ గా మొదలెట్టడం, సుజిత్ ని హైప్ చెయ్యకుండా ప్రభాస్, శ్రద్దాకపుర్ లే హైలెట్ కావడం, ఇక బాలీవుడ్ నుండి పెద్ద నటులను తీసుకున్నారు కానీ.. సినిమాలో వాళ్ళనెందుకు తీసుకున్నారో ఎక్కడా ఓ పట్టాన అర్ధం కాదు. ఇక పాటలు విషయంలోనూ రాంగ్ స్టెప్ వేశారు. ఒక్కో పాటకి ఒక్కో సంగీత దర్శకుడు. ఒక్క పాటా ఆకట్టుకోలేదు. మరి సాహోకి 300 కోట్ల పెట్టుబడి పెట్టారు.. కానీ ఈ టాక్ తో ఇప్పుడు అంత రికవరీ చెయ్యడం కష్టం సుమీ అనే గుసగుసలు ఫిలింనగర్‌లో వినబడుతున్నాయి.

Saaho Result at Box Office:

Saaho not Reached Baahubali 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ