Advertisementt

ఈ భామలు 80 చెప్పి.. 50కి ఓకే అంటున్నారు!

Sat 31st Aug 2019 04:16 PM
nabha natesh,nidhi agarwal,remuneration,ismart shankar,producers  ఈ భామలు 80 చెప్పి.. 50కి ఓకే అంటున్నారు!
Nabha Natesh and Nidhi Agarwal remuneration ఈ భామలు 80 చెప్పి.. 50కి ఓకే అంటున్నారు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో అసలే సినిమా అవకాశాలు చాలా తక్కువ. మరి అలాంటి టైములో ఒక్క సినిమా హిట్ అయితే మన హీరోయిన్స్ వెంటనే రెమ్యూనరేషన్ పెంచేయడం ఈమధ్య కామన్ అయిపోయింది. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న నభానటేష్, నిధి అగర్వాల్ లు తమ పారితోషికాలు అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. 

వీరిద్దరూ ఒక మాట మీద ఉండి కొత్త ఆఫర్ వస్తే ఎనభై లక్షలు కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వీరు అంత చెప్పిన మాత్రాన మన ప్రొడ్యూసర్స్ ఏమి ఇచ్చేయరు. వారితో బేరాలు, సారాలు మామూలే. రీసెంట్ గా నిధి ఓ సినిమా కోసం 80 లక్షలు అడిగితే బేరాలు, సారాలు తరువాత 50 లక్షలకు ఒప్పుకుందట.

అలానే నభా కూడా చెప్పడం 80 వరకు చెబుతున్నట్లు, యాభై రేంజ్ లో ఒప్పుకుంటున్నట్లు వినిపిస్తోంది. అసలే హీరోయిన్స్ కి మంచి పోటీ ఉన్న టైములో ఈ మాత్రం తగ్గకపోతే అవకాశాలు అసలు రావు అని వీరికి అర్ధం అయిపోయినట్టు ఉంది.. అందుకే రెమ్యూనరేషన్ తగ్గిస్తున్నారు.

Nabha Natesh and Nidhi Agarwal remuneration:

Ismart Heroines Remuneration Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ