బాహుబలి తర్వాత ప్రభాస్ ప్లాన్ మొత్తం మారిపోయింది. బాహుబలితో ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలను కూడా ఇండియా వైడ్ గానే ప్లాన్ చేసుకున్నాడు. అందుకే సుజిత్ తో సాహో లాంటి నేషనల్ మూవీని తయారు చేయించాడు. చిన్న దర్శకుడైనా పెద్ద బాధ్యతను సుజిత్ మోయాల్సి వచ్చింది. కావాల్సినంత పెట్టే నిర్మాతలు.. ప్రభాస్ చెప్పింది చెయ్యడానికి వెనుకడుగు వెయ్యని నిర్మాతలు దొరకడంతో.. చిన్నగా మొదలైన సాహో ఈరోజు నేషనల్ వైడ్ మూవీ గా ప్రేక్షకుల ముందు నిలిచింది. భారీగా తెరకెక్కిన ఈ సాహో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్సెస్ తో, అదిరిపోయే సినెమాటోగ్రఫీతో, అలాగే అద్భుతమైన నేపధ్య సంగీతంతో, ప్రభాస్ నటనతో ఆకట్టుకున్న సాహో సినిమా నేడు వరల్డ్ వైడ్ గా అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనబడుతుంది.
సినిమాలో స్టోరీ లైన్ చాలా చిన్నగా వున్నా స్క్రీన్‌ప్లే మాయాజాలంతో సినిమాని లాగించేయొచ్చు అనుకున్నారు. అలాగే బాలీవుడ్ నటులైతే సినిమాకి భారీ క్రేజ్ వస్తుంది అనుకున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ నుండి స్టెంట్ మాస్టర్స్ ని పిలిపిస్తే యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయానుకున్నారు. అందుకే చెయ్యాల్సినవన్నీ చేసింది సాహో టీం. సుజిత్ కూడా శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు. అయితే సాహో టీం అనుకున్న అవుట్ ఫుట్ రాలేదనే టాక్ ప్రేక్షకుల నుండి వినబడుతుంది.
మొదటి నుండి చెప్పినట్టుగానే.... యాక్షన్ పాళ్ళు ఎక్కువైయ్యాయని.. బాలీవుడ్ తారాగణం సినిమాలో ఎక్కువడంతో.. అక్కడక్కడా డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక పాటలు విజువల్ గా రిచ్ గా కనబడినా... వినడానికి అంత వినసొంపుగా అయితే లేవు. ఇక స్క్రీన్ ప్లే కూడా గందరగోళంగా మారిపోవడం, కామెడీ పెట్టడానికి వీలులేని స్టోరీ లైన్ ఉండడంతో.. కామెడీ కొరవడడం తో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అవుతున్నారనే టాక్ వినబడుతుంది. మరి ఈ టాక్ తో సాహో అనుకున్న అంచనాలు దరి చేరుతుందో లేదో తెలియడానికి కాస్త సమయం పడుతుంది.