Advertisementt

‘డిస్కోరాజా’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు

Sat 31st Aug 2019 03:11 PM
disco raja,release date,raviteja,vi anand  ‘డిస్కోరాజా’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు
Disco Raja Movie Release Date Fixed ‘డిస్కోరాజా’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు
Advertisement
Ads by CJ

డిసెంబర్ 20న మాస్ మహారాజా రవితేజ, ఎస్ ఆర్ టి ఎంటర్టైన్ మెంట్స్, వి.ఐ.ఆనంద్ ... ‘డిస్కోరాజా’ గ్రాండ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత రామ్ తాళ్లూరి ప్రకటించారు. అలాగే సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నారు. మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తాళ్లూరి నిర్మాణంలో, సాయి రిషిక సమర్పణలో, రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... మాస్ రాజా రవితేజతో, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మా బ్యానర్లో నిర్మిస్తున్న డిస్కోరాజా చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం. సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన ప్రాంతాల్లో, లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్, హాట్ బ్యూటీ తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ హాంగులతో, గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నాం. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్  కామెడీతో ప్రేక్షకులకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ప్రీ లుక్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుందని ధీమాగా చెప్పగలం.. అని అన్నారు. 

Disco Raja Movie Release Date Fixed:

Disco Raja Movie Release on December 20

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ