దాదాపు 350 కోట్లు బడ్జెట్ తో ప్రభాస్ నటించిన సాహో చిత్రం నైట్ యూఎస్ లో ప్రీమియర్స్ రూపంలో రిలీజ్ అయింది. దాంతో ఈసినిమా ఎలా ఉందనే టాక్ వచ్చేసింది. దర్శకుడు సుజీత్ తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సినిమాను ప్రేక్షకుడి ఊహకందని రీతిలో అదరగొట్టాడని టాక్. అందరు ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందని మాట్లాడుతున్నారు. చాలా గ్రాండ్ విజువల్స్‌తో అదరిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రధాన పాత్రల పరిచయం చేస్తూ సెకండ్ హాఫ్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోయిందని చెబుతున్నారు.
ఓవరాల్ గా ఈమూవీ గురించి ఓవర్సీస్ ఆడియెన్స్ చెబుతున్న ప్రకారం.. అసలు మనం చూసింది ఇండియన్ సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమానా అనే ఆశ్చర్యంలోకి వెళ్లిపోయారని తెలుస్తుంది. ఇండియాలో ఈమూవీ కనీసం 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెబుతున్నారట. ఫ్యాన్స్ కు ఈమూవీ ఒక ఫీస్ట్ అని చెబుతున్నారు. ఇండియన్ హిస్టరీ లోనే మునుపెన్నడూ చూడని బెస్ట్ యాక్షన్ సీక్వెన్సులు ఈ చిత్రంలో ఉన్నాయంటున్నారు.
ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి అని చెబుతున్నారు. ‘సాహో’ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలైంది.