Advertisementt

ఒకే వేదికపై పవర్, సూపర్ స్టార్స్.. ఎందుకంటే..!

Fri 30th Aug 2019 03:31 PM
pawan kalyan,mahesh,hyderabad,tollywood stars  ఒకే వేదికపై పవర్, సూపర్ స్టార్స్.. ఎందుకంటే..!
Pawan kalyan, Mahesh On One Stage! ఒకే వేదికపై పవర్, సూపర్ స్టార్స్.. ఎందుకంటే..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఎక్కువ మంది అభిమానులు ఎవరికున్నారా..? అని అడిగితే మొదట గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఇద్దరికీ ఒకరికి ఒకరు నటనలోనే కాదు.. ఫ్యాన్ పాలోయింగ్‌లోనూ ఏ మాత్రం అస్సలు తగ్గరు. అయితే ఇద్దరూ ఒకే వేదికపై దర్శనమిస్తే.. ఇక ఈ ఇద్దరి స్టార్ల ఫ్యాన్స్ పండుగే.. ఆ ఈవెంట్ ఇక సూపర్ హిట్టే అవుతుంది. త్వరలో ఇదే జరగబోతోంది.

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ (టీసీపీఈయూ) స్థాపించి 25 ఏళ్లు అయిన సందర్భంగా సదరు సంస్థ రజతోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇన్‌డోర్‌ స్టేడియం వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌, నిర్మాతలు కె.ఎస్‌ రామరావు, దిల్‌రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, రాజీవ్‌ కనకాల సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది.

అయితే వీరితో పాటు.. పవన్ కల్యాణ్, మహేష్ బాబులను రప్పించాలని టీసీపీఈయూ ప్రయత్నించిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ఈ ఇద్దరూ ‘అర్జున్’ సినిమా సమయంలో పవన్, మహేష్ కలిసి ఒకేచోట కలుసుకున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఒకే వేదికపై కనిపించలేదు. సో.. చాలా రోజుల తర్వాత ఇలా ఈ ఇద్దరు స్టార్స్ కలవబోతున్నారన్న మాట. మరి ఇందులో ఏమాత్రం నిజముందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పవర్, సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పెద్ద పండేగనని చెప్పుకోవచ్చు.

Pawan kalyan, Mahesh On One Stage!:

Pawan kalyan, Mahesh On One Stage!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ