Advertisementt

‘సాహో’ ఇంట్రో సీన్‌ లీక్ అయ్యిందోచ్.. సూపర్బ్!

Fri 30th Aug 2019 03:00 PM
young rebal star prabhas,saaho,intro scene,dubai  ‘సాహో’ ఇంట్రో సీన్‌ లీక్ అయ్యిందోచ్.. సూపర్బ్!
Prabhas ‘Saaho’ Intro Scene Leaked!! ‘సాహో’ ఇంట్రో సీన్‌ లీక్ అయ్యిందోచ్.. సూపర్బ్!
Advertisement
Ads by CJ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. సినిమా రిలీజ్‌ సమయం దగ్గరపడుతుండటంతో ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. ఇప్పటికే నటీనటుల రెమ్యునరేషన్‌తో పాటు పలు విషయాలపై పుకార్లు రాగా తూచ్.. అవన్నీ అబద్ధమేనని చిత్రబృందం మరీ ముఖ్యంగా ప్రభాస్ కూడా స్పందించారు. 

ఇక అసలు విషయానికొస్తే.. విదేశాలల్లో సాహో సినిమా ఒక్కరోజు ముందు విడుదలైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘సాహో’లో ప్రభాస్ ఇంట్రో సీన్‌ లీకైంది. ఈ వీడియోలో ప్రభాస్ సిక్స్ ఫ్యాక్‌తో కనిపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రోమాలు నిక్కబొడుచుకునేట్టుగా ఆయన ఎంట్రీ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సాహోకి సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారింది. మన తెలుగులో ఆగస్ట్-30న మధ్యాహ్నానికి సినిమాలో పస ఉందా లేదా అనేది తేలిపోనుంది.

Prabhas ‘Saaho’ Intro Scene Leaked!!:

Prabhas ‘Saaho’ Intro Scene Leaked!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ