Advertisementt

అక్టోబర్ 2న ‘సైరా’ రిలీజ్ అవ్వడం లేదా?

Fri 30th Aug 2019 01:28 AM
sye raa narasimha reddy,sye raa,war,release,gossips,october 2  అక్టోబర్ 2న ‘సైరా’ రిలీజ్ అవ్వడం లేదా?
Gossips on Sye Raa Narasimha Reddy Release అక్టోబర్ 2న ‘సైరా’ రిలీజ్ అవ్వడం లేదా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు ఈమూవీ తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వనుంది. అయితే బాలీవుడ్ మీడియాలో ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ గురించి రూమర్స్ వస్తున్నాయి. సైరా చిత్రం అక్టోబర్ 8 లేదా 9న విడుదలయ్యే అవకాశం వుందన్నది ఆ గాసిప్.

ఆల్రెడీ దీనిపై ట్వీట్స్ కూడా వచ్చాయి. దీనికి కారణం అదే రోజు అంటే అక్టోబర్ 2న బాలీవుడ్‌లో ‘వార్’ అనే సినిమా రిలీజ్ అవుతుంది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయి. ఈసినిమాకి పోటీగా వెళ్తే సైరాకు నష్టం తప్పదు.

అసలే సైరా పాన్ ఇండియా సినిమా. ఏ మాత్రం తేడా కొట్టిన అసలుకే మోసం వస్తుంది. అందుకే సైరాను వారం తరువాత రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. మరి బాలీవుడ్‌లో వారం వెనక్కి వెళ్తే అన్ని భాషల్లో వెళ్తుందా? ఏమో చూడాలి. అసలు ఇందులో ఎంత నిజముందో చూడాలి.

Gossips on Sye Raa Narasimha Reddy Release:

Doubts on Sye Raa Narasimha Reddy Release 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ