మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘సైరా’ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అక్టోబర్-2 న రిలీజ్ అవ్వబోతుంది. బారి బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా తో పోటీ పడడానికి ఏ నిర్మాతలు ఇస్తా పడడంలేదు. అందుకే మన టాలీవుడ్ లో ఈసినిమాకి పోటీగా ఏ సినిమా రిలీజ్ అవ్వడంలేదు. కాకపోతే హిందీలో మంచి పోటీ ఉండనుంది. అదే రోజు అక్కడ వార్ అనే సినిమా రిలీజ్ కానుంది. హ్రితిక్ నటిస్తున్న ఈసినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
నిన్న రిలీజ్ అయినా ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. యాక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఉన్నాయి. ఈమూవీ ఎక్కువ మాస్ ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వనుంది. కానీ సైరా కేసు వేరు. ఈమూవీ స్వాతంత్ర సమరయోధుడి నిజ గాథ. ఇందులో యాక్షన్ సీన్ తో పాటు గూస్ బంప్స్ ఇచ్చే ఎలివేషన్లు చాలానే ఉన్నాయి అని తెలుస్తుంది. పైగా చిరు ఎన్నడూ చేయని విధంగా ఇందులో పోరాట యోధుడిగా కనిపించనున్నాడు.
సౌత్ వరకు సైరా కు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు. కానీ నార్త్ లో మాత్రం కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. వార్ తెచ్చుకునే టాక్ ని బట్టి సైరా అక్కడ పెర్ఫార్మ్ చేయడం ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ హిందీలో ఈసినిమా స్క్రీన్లను చేయడం జరిగింది.