Advertisementt

తెలుగు హీరోలు ఈ భామను ఓ చూపు చూస్తారా!

Thu 29th Aug 2019 01:46 PM
saaho actress,shraddha kapoor,tollywood,tollywood heros  తెలుగు హీరోలు ఈ భామను ఓ చూపు చూస్తారా!
News About Saaho Actress Shraddha Kapoor తెలుగు హీరోలు ఈ భామను ఓ చూపు చూస్తారా!
Advertisement
Ads by CJ

సాహో చిత్రంతో బాలీవుడ్ నుండి ఇటు సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది శ్రద్ద కపూర్. బాలీవుడ్ లో నటన టాలెంట్ తో నెట్టుకొస్తున్న శ్రద్ద కపూర్ గ్లామర్ పరంగా పూర్. ప్రభాస్ పక్కన సాహో లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న శ్రద్ద కపూర్... సాహో లో పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ తో ట్రావెల్ చేసే పాత్రలో ఫ్యాన్స్ షర్ట్ తో కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో భారీగా పలు భషాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరీ యాక్షన్ అంటే భయపడతారనుకున్న మూవీ టీం శ్రద్ద కపూర్ లోని గ్లామర్ యాంగిల్ చూపిస్తూ సాహో సాంగ్స్ విజువల్ గా వదులుతున్నారు.

ప్రభాస్ తో లిప్ లక్స్, గ్లామర్ డ్రెస్సులతో కనిపిస్తున్న శ్రద్ద కపూర్ లో హాట్ యాంగిల్ మాత్రం కనిపించడం లేదు. అయినా శ్రద్ద రొమాంటిక్ లుక్స్ బావున్నాయి. మరి సాహో గనక హిట్ అయితే.. సినిమాలో శ్రద్ద నటన బావుంటే.. టాలీవుడ్ ఏమిటి, కోలీవుడ్ స్టార్ హీరోల చూపు శ్రద్ద కపూర్ మీద పడినా పడొచ్చు. శ్రద్ద లుక్స్, ఆమె గ్లామర్, నటన నచ్చితే... తమ తదుపరి సినిమాల కోసం ఎమన్నా చూసినా చూడొచ్చు. ఎలాగూ శ్రద్ద కపూర్ రెమ్యునరేషన్ కూడా టాలీవుడ్ హీరోలకు, కోలీవుడ్ హీరోలకు అందుబాటులనే ఉంది కూడాను. శ్రద్ద సాహో కోసం రెండేళ్లకు 3 నుండి నాలుగు కోట్లు మాత్రమే అందుకుంది సమాచారం. సో... సాహో హిట్ అయితే శ్రద్ద కపూర్ పంట పండినట్లే.

News About Saaho Actress Shraddha Kapoor:

News About Saaho Actress Shraddha Kapoor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ