మరో 48 గంటల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో రిలీజ్ అవ్వబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో ప్రేక్షకుల్లో టెన్షన్ మొదలైంది. సాహో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని టీం అంతా ఎప్పటినుండో చెబుతున్నారు. కథలో చాలా ట్విస్టులు ఉంటాయి అని, ప్రేక్షకులు బాగా థ్రిల్ అవుతారు అని టీం చెబుతుంది.
కథలో అవసరం అయిన చోట మాత్రమే యాక్షన్ సీన్స్ ఉంటాయని, యాక్షన్, థ్రిల్స్ తో చాలా గమ్మత్తయిన స్క్రీన్‌ప్లేతో సరికొత్తగా అనిపించే చిత్రాన్ని తీర్చిదిద్దాడని చెబుతున్నారు. ట్విస్టులు అయితే ప్రేక్షకుల మెదడుకు పదును పెడతాయి అని మాస్‌ని కాస్త తికమక పెడతాయి అని తెలుస్తుంది. తెలివిగా ఆలోచించే వారికి ఈమూవీ బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. మరి దీని వల్ల సాహోకి మాస్ అప్పీల్ ఎంత వుంటుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందులో నిజం లేకపోలేదు. మాస్ ప్రేక్షకులకి స్క్రీన్ ప్లేతో సంబంధం లేదు. వారికి మూడునాలుగు సాంగ్స్, రెండుమూడు ఫైట్స్ ఉంటే చాలు. కానీ సాహో ఫుల్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. మరి దీనికి మాస్ అప్పీల్ ఎంత వుంటుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బి, సి సెంటర్స్ లో ఈసినిమాకి బజ్ వస్తుందా? వస్తే ఎంతవరకు లాకొస్తుంది అనేది సాహో టీంని టెన్షన్ పెడుతున్న అంశం. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.