Advertisementt

పాపం ఇలియానా.. ఇప్పుడేంటి దారి?

Tue 27th Aug 2019 08:06 PM
ileana,andrew kneebone,unfollow,instagram,break up  పాపం ఇలియానా.. ఇప్పుడేంటి దారి?
Ileana Break up with Boyfriend పాపం ఇలియానా.. ఇప్పుడేంటి దారి?
Advertisement
Ads by CJ

 

 

‘పోకిరి’ భామ ఇలియానా‌కి సౌత్ లో కెరీర్ ముగిసిపోయినట్టే... ఎందుకంటే అమర్ అక్బర్ ఆంటోని సినిమా కనీసం యావరేజ్ అయినా ఇలియానాకి మరో సినిమా అన్న ఉండేది. కానీ ఇలియానా ఆఖరి చిత్రం అమర్ అక్బర్ ఆంటోని అట్టర్ ప్లాప్ అవడంతో... ఇక్కడి దర్శకనిర్మాతలు ఇలియానా పేరు మర్చిపోయినట్టే కనబడుతుంది వ్యవహారం. ఇక బాలీవుడ్ లో బ్రేక్ వచ్చినా అవకాశాలు అంతంత మాత్రం. ఏదో బాలీవుడ్‌లో ఒకటి అరా సినిమాలు చేస్తున్న ఇలియానా.. ఇప్పుడు కెరీర్ పరంగా మాత్రమే కాకుండా... వ్యక్తిగతంగానూ కాస్త ఇబ్బందులు పడుతున్నట్లుగా చెబుతున్నారు.

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడే ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫేర్ ఆండ్రూ‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ... ప్రేమలో మునిగి తేలింది. ఆండ్రూ‌.. ఇలియానాకి ఫోటో షూట్స్ చేస్తుంటే.. ఇలియానా ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో వదలడం.. ఇలా వారి మధ్య ప్రేమ బంధం పెళ్లి వరకు వెల్లిందనడమే కాదు.. ఇలియానా ప్రెగ్నెంట్ అని కూడా ప్రచారం జరిగింది. 

అయితే అంతగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్నారు. మరి వీరి మధ్యన ఏదో జరుగుతుంది అనుకునేలోపు.. ఇలియానా సోషల్ మీడియాలోని ఆండ్రూ‌‌తో తాను దిగిన ఫొటోస్ అన్ని డిలీట్ చెయ్యడంతో.. ఇలియానా - ఆండ్రూ‌ విడిపోయారనే టాక్ మొదలైంది. ఇల్లి బేబీ.. ఆండ్రూ‌కి బ్రేకప్ చెప్పేసి.. ఇలా ఫొటోస్ డిలేట్ చేసిందని అంటున్నారు. మరి కెరీర్ లోను, లవ్ లోను ఇలియానా ఒకేసారి ఫెయిల్ అయినట్లుగా అనిపిస్తుంది. 

Ileana Break up with Boyfriend:

Ileana and Andrew Kneebone unfollow each other on Instagram