కింగ్ నాగార్జునకు, అతని కోడలు సమంతకు పడడం లేదా? ఏమో గత కొన్ని రోజులు నుండి ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నాగ్ తీసుకునే నిర్ణయాలు సామ్‌కి నచ్చడంలేదని అర్ధం అవుతుంది. రీసెంట్ గా నాగ్ ఒక ఫ్రెంచ్ సినిమాకి రీమేక్ గా చేసిన మన్మథుడు 2 చేయొద్దు అని సామ్ పదేపదే నాగ్ అండ్ చైతూలకు చెప్పిందట. కానీ నాగ్ అవి ఏమి పట్టించుకోకుండా సినిమా చేసేయడంతో సామ్ ఫీల్ అయిందట. పైగా ఈమూవీలో ఆమెతో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర కూడా చేయించాడు.
మరోపక్క సామ్ ప్రోద్బలం వలనే చైతన్య ‘బంగార్రాజు’ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసి శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నాడనే రూమర్ కూడా వుంది. నాగ్ ఏమో బంగార్రాజు షూటింగ్ త్వరగా స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ చూస్తే అదేమో వెనక్కి వెళ్లిపోయింది. ఇలా చైతూ చేసే ప్రతి సినిమా విషయంలో సామ్ హ్యాండ్ ఉండడంతో నాగార్జున గుస్సా అవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. చైతు అండ్ సామ్ ఇద్దరూ సొంత బ్యానర్‌లో సినిమాలు చేయకుండా బయట బ్యానర్స్ లో సినిమాలు చేస్తుండడంతో నాగ్‌కి అసహనం కలిగిస్తోందని రూమర్స్ వున్నాయి. మరి వీటిపై నాగ్ రెస్పాండ్ అవుతారా? లేదా చూడాలి.