హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 13 న రిలీజ్ కాబోతుంది. డైరెక్టర్ - నిర్మాతలకి మధ్య వచ్చిన సమస్యలు అన్నీ తొలగిపోయి, ఓ ఒప్పందం కుదిరినట్లు వినిపిస్తోంది. ఈసినిమాకి స్టార్టింగ్ లో హరీష్ శంకర్ లాభాలు వాటా తీసుకుంద్దాం అనుకున్నాడు. అందుకు ప్రొడ్యూసర్స్ కూడా ఓకే చెప్పి షూటింగ్ స్టార్ట్ చేసారు. కానీ సినిమా కంప్లీట్ అవుతున్న టైములో ఈమూవీకి అనుకున్న దానికంటే ఎక్కువే అయిందని తెలుస్తుంది. దాదాపు ఈమూవీకి ముఫైకోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. అది కూడా డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండా. దాంతో నిర్మాతలు-దర్శకుడు వాటాల వ్యవహారం పక్కనపెట్టి, సెటిల్ మెంట్ కు కూర్చున్నట్లు తెలుస్తోంది.
లాస్ట్ కి హరీష్ శంకర్ 7 కోట్లు తీసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. హరీష్ గత చిత్రం డిజెకు ఎనిమిది కోట్ల వరకు తీసుకున్నారు. కానీ ఈమూవీ కాస్టింగ్ వేరు, మార్కెట్ వేరు. అయితే తనకు వచ్చిన 7 కోట్లు రెమ్యూనరేషన్ లో హరీష్ రెండున్నర కోట్లు ఖర్చుచేసి, ఉత్తరాంధ్రకు వాల్మీకి హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైట్స్ ని దిల్ రాజు దగ్గర ఉంచినట్టు తెలుస్తుంది. ఏదిఏమైనా హరీష్ ఈసినిమాతో గట్టిగానే సంపాదిద్దాం అని చూస్తున్నాడు. సినిమాలో విషయం ఉండి హిట్ అయితే హరీష్ కు కాసుల వర్షమే.