యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. గత రెండ్రోజులుగా ఈ సినిమాలో ‘బ్యాడ్ బాయ్’ అనే ఐటెమ్ సాంగ్‌కు బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్‌కు కోట్లిచ్చి మరీ అరువుకు తెచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ బ్యాడ్ బాయ్ పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ఇక అసలు విషయానికొస్తే.. ఈ ఐటెమ్ సాంగ్‌కు మొదట చందమామ భామ.. కాజల్‌ను దర్శకనిర్మాతలు సంప్రదించారట. అయితే ఈ ముదురు భామ గట్టిగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో రెండోమాట కూడా మాట్లాడకుండానే మిన్నకుండిపోయి.. బాలీవుడ్ భామను పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆమె అడిగిన రెమ్యునరేషన్‌కు నిర్మాత ఒకింత కంగుతిన్నారట. అందుకే ఇక కాజల్ అక్కర్లేదనుకుని జాక్వలిన్‌ను పట్టుకొచ్చారట.
వాస్తవానికి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ‘పక్కా లోకల్.. పక్కా లోకల్’ అంటూ నర్తించిన విషయం విదితమే. అందుకే ఈ భామ అయితే కరెక్టుగా ప్రభాస్ సరసన సెట్ అవుతుందని భావించిన నిర్మాతలు.. ఆమెను అడగ్గా ఐటెమ్స్‌లో నటించకూడదని అలా చెప్పిందో లేకుంటే మరే కారణాలున్నాయో తెలియాల్సి ఉంది మరి. ప్రభాస్ సరసన ఈ భారీ చిత్రంలో ఒక వేళ నటించుకుంటే ఈ భామ అదృష్టవంతురాలేనేమో.. పాపం లక్కీ చాన్స్ మిస్ చేసుకుంది.