టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. ఈ మామా అల్లుళ్లకు రాశి కన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ షురూ చేసిన చిత్రబృందం ఒకట్రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది.
తాజాగా.. రాశి కన్నాకు సంబంధించిన ఓ అదిరిపోయే పిక్ బయటికొచ్చింది. ఈ ఫొటోలో రాశీ అచ్చంగా పల్లెటూరి పిల్లలాగా.. లంగా, ఓణీలో ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ పల్లెటూరి పంతులమ్మగా నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో ఈ భామ ఎప్పుడూ పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన దాఖలాల్లేవ్. ఫస్ట్ టైమ్ ప్రయోగం చేస్తున్న రాశీ.. ఏ మేరకు సక్సెస్ అవుతుందో మరి.