తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ షో ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ కంటెస్టెంట్లే అనుకుంటే హోస్ట్ నాగార్జున కూడా డోస్ పెంచి.. హౌస్‌మేట్స్‌పై తిట్ల దండకం వదలడం, ఆ తర్వాత కూల్ చేయడం ఇలా షురూ చేస్తున్నాడు. ఇక అసలు విషయానికొస్తే.. శనివారం రానే వచ్చింది.. ఇక ఎవరు ఎలిమినేట్ అవుతారా..? అనేదానిపై బిగ్‌బాస్ ప్రియులు, ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.
ప్రతీ వారంలాగా ఈవారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే.. ఆ స్థానంలోకి ఎవరొస్తారు..? అనేదానిపై కూడా సర్వత్రా ఆసక్తి అంది. అయితే తెలుగమ్మాయి ఈషా రెబ్బా బిగ్ బాస్ షో లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఇదేగాని జరిగితే షోకు మాంచి గ్లామర్ యాడ్ అయినట్లే మరి.
ఇదిలా ఉంటే ఇప్పటికే షో లోకి వైల్డ్ కార్డు ద్వారా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇవ్వడం.. కొద్దిరోజులకే ఎగ్జిట్ అవ్వడం కూడా జరిగిపోయింది. మరి ఈషా రెబ్బా హౌస్‌లోకి వెళ్తే ఏ మాత్రం రాణిస్తుందో వేచి చూడాల్సిందే మరి.