Advertisementt

‘చీమ-ప్రేమ మధ్యలో భామ!’ ఫస్ట్ కాపీ సిద్ధం

Sun 25th Aug 2019 11:53 AM
cheema prema madyalo bhama,movie,details  ‘చీమ-ప్రేమ మధ్యలో భామ!’ ఫస్ట్ కాపీ సిద్ధం
Cheema Prema Madyalo Bhama Ready to Release ‘చీమ-ప్రేమ మధ్యలో భామ!’ ఫస్ట్ కాపీ సిద్ధం
Advertisement
Ads by CJ

‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’ విడుదలకు సిద్ధం!

ఈ సృష్టిలోని ఒకానొక అత్యంత అల్ప ప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది! అంత వరకు బాగానే ఉంది - మరి అది సాధ్యమా ? ఏం  జరుగుతుంది ? అసలు ఆ భావన  ఎలా ఉంటుంది ? పైగా దానికి ప్రేమ, శృంగారం తోడైతే...  అది ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలే ‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’ సినిమా. 

మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) ఫిలిమ్స్  ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు దర్శకత్వంలో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ - ప్రేమ మధ్యలో భామ !’. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. 

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు మాట్లాడుతూ.. ‘‘‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’ ఓ యువజంట ప్రేమ ప్రయాణం. కుటుంబ విలువలతో, కామెడీ సన్నివేశాలతో ఒక మంచి కుటుంబ కథాచిత్రాన్ని నిర్మించాము. మా సినిమా యూత్ మరియు ఫ్యామిలీ  ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది. సంగీతం మరియు గ్రాఫిక్స్ వర్క్ చిత్రానికే హైలెట్’’ అని అన్నారు.

నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రంలో చీమ ప్రధాన ఆకర్షణ. గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా కొత్తవాళ్లతో చిత్రీకరించినా  ఖర్చుకి వెనకాడకుండా నిర్మించాము. రవి వర్మ గారు అందించిన సంగీతం మరియు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం, గీతా మాధురి గార్లు పాడిన పాటలు చాలా బాగున్నాయి.  సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని సెప్టెంబర్ లో విడుదల చేస్తాము’’ అని అన్నారు.

నటీనటులు :

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి మరియు సురేష్ పెరుగు. 

సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్ పి బాలసుబ్రమణ్యం, గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్, కోరియోగ్రఫీ : చిరంజీవి, సుభాష్, ఆనంద్. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు, నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ

Cheema Prema Madyalo Bhama Ready to Release:

Cheema Prema Madyalo Bhama Movie Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ