‘బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 10 శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తోన్న ఈ చిత్రాన్ని పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
నటీనటులు:
లక్ష్, దిగంగన సూర్యవంశీ, రవిప్రకాశ్, రవి వర్మ, నోయల్ సేన్, చిత్రం శ్రీను, కృష్ణేశ్వర్ రావ్, రామకృష్ణ, శరత్ తదితరులు
సాంతికేతిక వర్గం:
దర్శకత్వం: రమేశ్ కడుముల
నిర్మాత: పద్మావతి చదలవాడ
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్
మ్యూజిక్: శేఖర్ చంద్ర
కెమెరా: రామకృష్ణ
ఎడిటర్: ఉపేంద్ర
ఆర్ట్: బ్రహ్మకడలి
కో డైరెక్టర్: నాగేంద్ర యర్రగుడి
ప్రొడక్షన్ కంట్రోలర్: అక్కినేని శ్రీనివాస్ రావ్