Advertisementt

పూజా హెగ్డే మతి పోగొట్టేసిందిగా..!

Sat 24th Aug 2019 10:31 PM
pooja hegde,ramp walk,lakme fashion week,heroine pooja hegde  పూజా హెగ్డే మతి పోగొట్టేసిందిగా..!
Pooja Hegde walks the ramp at Lakme Fashion show పూజా హెగ్డే మతి పోగొట్టేసిందిగా..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో అతిపెద్ద ఫ్యాషన్ షో లక్మే ఫ్యాషన్ వీక్. ఫ్యాషన్ షోస్ కే రారాజు. బాలీవుడ్ లో పలు టాప్ ఫ్యాషన్ డిజైనర్లు తయారు చేసే మోడ్రెన్ డ్రెస్సులను మోడల్స్ తో పాటుగా బాలీవుడ్ హాట్ సెలబ్రిటీస్ కూడా ఆ డిజైనర్ డ్రెస్సులు వేసుకుని రాంప్ పై హోయలు పోతూ వాక్ చేస్తుంటే.. చూడడానికి రెండు కళ్ళు చాలవు. ప్రతి ఏడాది నాలుగు రోజుల పాటు జరిగే ఈ అతి పెద్ద ఫ్యాషన్ వీక్ కి బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా హాజరవడమే కాదు.... మంచి మంచి డ్రెస్సులతో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తారు. తాజాగా జరుగుతున్న లక్మే ఫ్యాషన్ వీక్ 2019 లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తయారు చేసిన డిజైనర్ డ్రెస్సులతో ఖుషి కపూర్, కత్రినా కైఫ్, పూజాహెగ్డే లాంటి సుందరీమణులు లక్మే ఫ్యాషన్ షో రాంప్ పై రాంప్ వాక్ చేసి అలరించారు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గరలో ఉన్న పూజా హెగ్డే మాత్రం స్పెషల్ డిజైనర్ డ్రెస్సులతో మతులు పోగొడుతుంది. డీజే, మహర్షి సినిమాల తర్వాత అల్లు అర్జున్ తోనూ, ప్రభాస్ సినిమాతోనూ బిజీగా ఉన్న పూజా హెగ్డే కి ఆ రెండు సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా చాలు.. టాప్ చైర్ ఎక్కేయ్యడానికి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోను సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే లక్మే ఫ్యాషన్ వీక్ లో హంస లాంటి నడకతో అతిథులను, అభిమానులను పిచ్చెక్కించింది. అందమైన డిజెనెర్ డ్రెస్ లో పూజ అందాల ఆరబోత అందరికి కనువిందు అన్నట్టుగా ఉంది. రాంప్ మీద హంసలాంటి నడకతో హోయలు పోతూ పూజా చేసిన రాంప్ వాక్ అందరిని ఆకట్టుకుంది.

Pooja Hegde walks the ramp at Lakme Fashion show:

Pooja Hegde showsstopper at Lakme Fashion week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ