టైటిల్ చూడగానే ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఓహో.. రీల్ లైఫ్‌లోనా అనుకుంటున్నారేమో.. అదీ కూడా అస్సలు కాదండోయ్.. రియల్ లైఫ్‌లోనేనట. సమంతకు నచ్చని పనులు నాగ్ చేస్తుండటంతో ఇకపై రిపీట్ కాకూడదని గట్టిగానే చెప్పిందట. అసలు ఈ కండిషన్స్ గోలేంటి..? నాగ్ ఏమన్నారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ మన్మథుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చేది అక్కినేని నాగార్జున అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఒకప్పుడు నాగ్ సినిమాలో థియేటర్లలోకి వస్తున్నాయంటే ఇక పరిస్థితులను మాటల్లో చెప్పడానికి కుదిరేది కాదు. అలాంటిది నాగ్ పరిస్థితి ఇప్పుడు మరీ ఘోరంగా తయారయ్యింది. ఇందుకు కారణం ఇటీవల వచ్చిన ‘మన్మథుడు- 2’. ఈ సినిమాలో కొన్ని అతి సీన్లు వల్లే అట్టర్ ప్లాప్ అయ్యిందన్నది టాక్.
అయితే సామ్ కూడా అసలు ఈ సీన్లు వద్దని పదే పదే చెప్పిందట. మామయ్య చెప్పిన మాట పెడచెవిన పెట్టడంతో కనీసం ప్రమోషన్స్‌కు కోడలు పిల్ల రాకపోవడానకి కారణం ఇదేనట. ఇక అయిపోయిందేదే అయిపోయింది.. ఇక ముందు చేసే సినిమాలో అయినా అతి సీన్లు.. అతి ప్రయోగాలు చేయొద్దని కండిషన్స్ మరీ పెట్టిందట. త్వరలో నాగ్ ‘బంగర్రాజు’ షూటింగ్ పాల్గొనబోతున్నారు. మరి కోడలు పిల్ల మాటలను ఈసారైనా మన్మథుడు లెక్కచేస్తాడో లేదో వేచి చూడాల్సిందే మరి.