డియర్ కామ్రేడ్ షూటింగ్ టైములో విజయ్ దేవరకొండ డైరక్టర్ కంటే బాగా ఇన్‌వాల్వ్ అయ్యాడని డైరెక్టర్‌ని పని చేయనివ్వకుండా తనకి నచ్చినట్టుగా సినిమా మలిచాడని.. రీషూట్స్ చేసి దర్శకుడి విజన్ చెడగొట్టాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అలానే విజయ్ తన ప్రతి సినిమా ప్రమోషన్స్ విషయంలో తానే స్వయంగా ప్లాన్ చేసుకుని ప్రమోషన్స్ చేస్తుంటాడు. అలానే డియర్ కామ్రేడ్ విషయంలో కూడా ప్రమోషన్స్ చాలా కొత్తగా చేసాడు.
కానీ క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో చేస్తోన్న చిత్రానికి క్రియేటివ్‌గా అసలు ఇన్‌వాల్వ్ కానని చెప్పేసాడట. అంతేకాదు ఈ సినిమా కోసం తను ప్రమోషన్ ఐడియాల జోలికి పోనని అంటున్నాడు. మరి విజయ్ ఎందుకు ఇలా అంటున్నాడో తెలియదు. మొదటి నుండి విజయ్ ఈసినిమాపై పెద్ద కాన్ఫిడెంట్‌గా లేడు. అందుకే ఈమూవీని పటించుకోవడంలేదని తెలుస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈమూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈమూవీ తరువాత పూరితో సినిమా చేసే అవకాశముంది విజయ్.