టాలీవుడ్ కుర్ర హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం విదితమే. ఇప్పటి వరకూ ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోస్‌ను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. దీంతో కుర్రహీరోకు దిమ్మదిరిగి బొమ్మ కనపడింది.
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కారు దిగి పరుగెత్తినట్లు సీసీ ఫుటేజీ కాకుండా తాజాగా మరికొన్ని వీడియోలు దర్శనమిచ్చాయి. ఇందులో తాను మద్యం మత్తులో ఉన్నానని.. తనను వదిలిపెట్టండి అని హీరోగారు బతిమాలినట్లు ఉంది. రోడ్డుపై పరుగుడెతుండగా కార్తిక్ అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగా రాజ్ తరుణ్ .. పై మాటలు ఆయనతో అన్నాడు. అంతేకాదు.. కార్తిక్ వీడియోలు సైతం తీశాడు. దీంతో కుర్రహీరో అడ్డంగా బుక్కయ్యాడు.
ఇదిలా ఉంటే.. ఆ వీడియోలను డెలీట్ చేయాలని రూ.5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టారని మీడియా ముందుకు వచ్చి కార్తిక్ చెప్పుకొచ్చాడు. వాటన్నింటికీ లొంగని కార్తిక్ మీడియా ముందుకొచ్చేయడం ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రాజ్‌తరుణ్ ఫ్రెండ్స్ పలువురు కార్తిక్‌కు ఫోన్ చేసి బెదిరించారని చెబుతున్నాడు. ఆఖరికి హీరో మేనేజర్, నటుడు రాజారవీంద్ర కూడా బెదిరించడం గమనార్హం. ఈ తరుణంలో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.