టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం RRR. భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైపోయింది. ఇద్దరు స్టార్ హీరోలు, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు ఈ సినిమాలో చేస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే సినిమాకు సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఇటు జూనియర్ ఫ్యాన్స్ .. అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.
అయితే ఈ సినిమాలో జూనియర్‌కు జోడీగా ఎవరు నటిస్తారన్న దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. ఇప్పటికే పలువురు తప్పుకోగా.. మరికొందర్ని సెలక్ట్ చేసినప్పటికీ మధ్యలోనే ఆ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లకు హీరోయిన్ వేట ముగిసిందని సమాచారం. ఎన్టీఆర్ జోడీగా మరోసారి అమెరికన్ అమ్మాయినే జక్కన్న కన్ఫామ్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆఫ్షన్ లేక హాలీవుడ్ బ్యూటీని తీసుకున్నారట.
అయితే ఈ తెల్లపిల్ల గురించి చెప్పాల్సిన టైమ్‌లో అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తానని రాజమౌళి అనుకుంటున్నారట. అంతేకాదు త్వరలోనే చిత్రయూనిట్ బల్గేరియాలో ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ షెడ్యూల్ మొదలయ్యే లోపే ఎన్టీఆర్ జోడీ గురించి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పాలని జక్కన్న భావిస్తున్నట్లు సమాచారం.