Advertisementt

ప్రియాంక చోప్రాపై పాక్ పైత్యం..!

Thu 22nd Aug 2019 04:21 PM
pak,unicef,priyanka chopra,goodwill ambassador  ప్రియాంక చోప్రాపై పాక్ పైత్యం..!
Pak asks UNICEF to remove Priyanka as goodwill ambassador ప్రియాంక చోప్రాపై పాక్ పైత్యం..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను పాకిస్థాన్ టార్గెట్ చేసిందా..? ఇప్పటికే పాక్ మహిళకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈ భామను ఇరకాటంలో పెట్టాలని పాక్ భావిస్తోందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా ఉన్న విషయం విదితమే. అయితే పాక్ మాత్రం వెంటనే ఆమెను అంబాసిడర్‌గా తప్పించాలని పాక్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ ఐక్యరాజ్యసమితికి లేఖ రాయడం గమనార్హం.

కాశ్మీర్ అంశంతో పాటు పాక్‌పై అణుదాడి చేస్తామన్న భారత్‌కు ప్రియాంక చోప్రా బహిరంగంగా మద్దతు పలికారని మజారీ ఐకాస రాసిన లేఖలో నిశితంగా వివరించారు. శాంతి దూతగా ఉండాల్సిన అర్హత ప్రియాంక చోప్రాకు లేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కాశ్మీర్‌లో ప్రజల హక్కులను కాలరాస్తోందన్నారు. 

ఇంత జరుగుతున్నా.. ఏమీ తెలుసుకోకుండానే మెదీ సర్కార్‌కు ప్రభుత్వానికి, ప్రభుత్వ సారథ్యంలోని ఆర్మీకి ప్రియాంక చోప్రా ఎలా మద్దతు పలుకుతారని మజారీ ఈ సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే పనిగట్టుకుని ప్రియాంకను టార్గెట్ చేసుకున్న పాక్‌ పైత్యంపై ఐక్కరాజ్యసమితి ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Pak asks UNICEF to remove Priyanka as goodwill ambassador:

Pak asks UNICEF to remove Priyanka as goodwill ambassador  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ