Advertisementt

‘కౌసల్య కృష్ణమూర్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలివే!

Wed 21st Aug 2019 10:15 PM
kousalya krishnamurthy,pre release event,vijay deverakonda,aishwarya rajesh,raashi khanna,ks ramarao,rajendra prasad  ‘కౌసల్య కృష్ణమూర్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలివే!
Kousalya Krishnamurthy Pre Release Event Highlights ‘కౌసల్య కృష్ణమూర్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలివే!
Advertisement

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ ద్వారా ఆగష్టు 23న విడుదలవుతున్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ తప్పకుండా హ్యుజ్‌ సక్సెస్‌ సాధిస్తుంది: క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ    

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్’‌. ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం హైదరాబాద్‌ జెఆర్‌సి కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి క్రేజీ హీరో విజయ్‌దేవరకొండ, అందాలభామ రాశిఖన్నా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. క్రికెట్‌ నేపథ్యంతో తెరకెక్కిన మూవీ కావడంతో అభిమానుల కోసం విజయ్‌ దేవరకొండ, ఐశ్వర్యా రాజేష్‌లు వేదిక మీద క్రికెట్‌ ఆడడం విశేషం. అలాగే ఈ కార్యక్రమంలో ఏషియన్‌ సినిమాస్‌ అధినేత నారాయణదాస్‌ నారంగ్‌ పాల్గొన్నారు. 

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కెఎస్‌ రామారావు మాట్లాడుతూ.. ‘‘నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం దర్శకుడు క్రాంతిమాధవ్‌. మా బేనర్లో విజయ్‌ దేవరకొండ హీరోగా చేస్తున్న చిత్రానికి కాస్టింగ్‌ ఫైనలైజ్‌ కోసం చూస్తున్న టైమ్‌లో తమిళంలో ఐశ్వర్యా రాజేష్‌ నటించిన ‘కణ’ చిత్ర టీజర్‌ను నాకు చూపించాడు క్రాంతి మాధవ్‌. ఆ పెర్ఫామెన్స్‌ నచ్చి ఆ క్యారెక్టర్‌ కోసం ఆమెను సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఆ టీజర్‌ నాకు బాగా నచ్చడంతో ‘కణ’ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేద్దాం అని ప్రయత్నం చేశాను.. కానీ కుదరలేదు. ఇంతలో సినిమా రిలీజ్‌ అయ్యి పెద్ద హిట్‌ అయింది. తెలుగులో ఆ సినిమా రైట్స్‌ కోసం నాతో పాటు చాలా మంది నిర్మాతలు పోటీపడ్డారు. నేను మొదటి నుండి ఆ సినిమా మీద ఆసక్తితో ఉండడం వల్లనో, ఐశ్వర్య రికమండేషన్‌ వల్లనో తెలీదు కానీ చివరకి ఆ సినిమా రైట్స్‌ నాకే దక్కాయి. తరువాత తెలుగులో కూడా ఆమెను నటించమని అడిగాము. నా మీద తనకున్న ఫాదర్‌ ఎఫెక్షన్‌తో తనూ ఒప్పుకుంది. భీమినేని గారు అయితే పూర్తి న్యాయం చేయగలడని ఆయనకే దర్శకత్వ భాద్యతలు ఇచ్చాము. ఐశ్వర్య, రాజేంద్ర ప్రసాద్‌ సాయంతో సినిమా చాలా గొప్పగా వచ్చింది. ఐశ్వర్య రాజమండ్రిలో ఎండలో తను తమిళ సినిమా కన్నా ఎక్కువ కష్టపడి నటించింది. నా సినిమాలన్నీ కంటెంట్‌ బాగుండడం ఆ కంటెంట్‌ తయారుచేసిన వారి గొప్పతనం. ఒక సంవత్సరం 200 సినిమాలు రిలీజైనా వాటన్నింటిలో మన సినిమానే గొప్పగా ఉండాలి అనేంత సెలెక్టీవ్‌గా ఉంటే తప్ప.. ఒక ప్రొడ్యూసర్‌గా నిలదొక్కుకోవడం కష్టం. అలా నేను ఈ స్థాయిలో ఉండటానికి కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కె విశ్వనాధ్‌, అజయ్‌ ఇలా ప్రతి వారు మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ కోసం కష్టపడడమే కారణం. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ బాగా రావడానికి, తమిళ్‌ సినిమా సోల్‌ మిస్‌ అవకుండా ఉండడానికి భీమినేని గారు ఎంతో కష్టపడ్డారు. 2019 లో ఒక గొప్ప సినిమా చూశాం అని ప్రతి ఒక్కరూ ఆనందించే సినిమా ఇది. డెఫినెట్‌ గా సినిమా ఘన విజయం సాధిస్తుంది అనే నమ్మకంతో ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా అన్ని ఏరియాల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. 

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘పెళ్లి చూపులు సినిమా నచ్చి మనం కలిసి ఒక సినిమా చేద్దాం.. అని కెఎస్‌ రామారావు గారు, క్రాంతి మాధవ్‌ నన్ను కలిశారు. ఆ సినిమా షూట్‌ నుండే ఇక్కడికి రావడం జరిగింది. ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌లో ఐశ్వర్య కూడా నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్‌ నటించిన చాలా సినిమాలు నేను చూశాను. తను మంచి పెర్ఫార్మర్‌. త్వరలో తనతో కలిసి నటించబోతున్నందుకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. కెఎస్‌ రామారావుగారిని మేము అందరం సెట్లో డాడీ అని పిలుస్తాము. మా అందరికీ ఒక తండ్రిలా ఏది కావాలన్నా...ఇవ్వడమే ఆయన పని. నాకు నచ్చింది, వచ్చింది సినిమానే ఇదే నా లైఫ్‌ ఇది కాకపోతే ఇంకేం చేస్తాం అని ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా ప్రతి రోజు సెట్‌కి వస్తారు. ఆయనకు సినిమా అంటే అంత ప్రేమ ఉండడం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. భీమినేని గారితో సహా ఎంటైర్‌ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌. ఆగష్టు 23న విడుదలవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

చిత్ర దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘కౌసల్య కృష్ణమూర్తి డెఫినెట్‌గా మా అందరికీ ఒక స్పెషల్‌ ఫిలిమ్‌. నేను నా ప్రతి సినిమాను ఫ్యాషనేట్‌గా చేయడానికే ప్రయత్నించా.. ఎందుకంటే సినిమానే నా లైఫ్‌. ఆకలితో ఉన్న వాడికి ఒక మంచి భోజనం దొరికితే ఎలా తృప్తిగా తింటామో.. అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిన సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. నా కెరీర్‌ స్టార్టింగ్‌లో నేను చేసిన సినిమాల్లా అన్ని ఎమోషన్స్‌ ఉంటూ డైరెక్టర్‌గా నాకున్న ఫ్యాషన్‌కి కిక్‌ ఇచ్చింది. నేను ఎక్కువ రీమేక్‌లు చేసినా నా సక్సెస్‌ రేట్‌ చాలా ఎక్కువ ఉండడానికి కారణం నేను ఆ రీమేక్‌ని మన నేటివిటీకి తగ్గట్లు మార్చి ఓన్‌ చేసుకొని చేయడమే. అందుకనే అవి అక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ రోజులు ఆడాయి. ఈ సినిమాను కూడా ఎంత బెటర్‌గా చేయొచ్చో అంతా చేశాను. క్రికెట్‌ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినా ఇది ఒక ఫిమేల్‌ సెంట్రిక్‌ మూవీ. ఒక అమ్మాయికి తండ్రిగా, ఒక కొడుకుగా రెండు రకాలుగా సంతృప్తిని కలిగించిన సినిమా ఇది. రాజేంద్ర ప్రసాద్‌గారి పెర్ఫామన్స్‌ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతంగా నటించారు. ఐశ్వర్యా రాజేశ్‌ నటన చూసి నాకే ఏడుపొచ్చేసింది. తను బోర్న్‌ ఆర్టిస్ట్‌. కెఎస్‌ రామారావు గారి లాంటి స్మార్ట్‌ ప్రొడ్యూసర్‌ నుండి నాకు కాల్‌ వస్తుంది, ఆయన బేనర్‌లో సినిమా చేసే అవకాశం వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు.. డెఫనెట్‌గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. 

రాశి ఖన్నా మాట్లాడుతూ.. ‘‘కణ సినిమా తమిళ్‌లో చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ సినిమా తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా మీ ముందుకు వస్తుంది. ఐశ్వర్య ఈ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేసింది. దానికి ప్రతిఫలంగా ఎన్నో అవార్డ్స్‌ కూడా లభించాయి. అదే చిత్రం ద్వారా తెలుగులో పరిచయం అవడం చాలా లక్కీ. కె ఎస్‌ రామారావు గారు ఎప్పటినుండో మంచి కంటెంట్‌ ఉన్న సినిమాల్ని నిర్మిస్తున్నారు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ మాట్లాడుతూ.. ‘‘కౌసల్య కృష్ణమూర్తి నా ఫస్ట్‌ తెలుగు ఫిలింగా వస్తుంది అని నేను ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. నేను ఫస్ట్‌ సైన్‌ చేసింది క్రియేటివ్‌ కమర్షియల్స్‌లో విజయ్‌ దేవరకొండ - క్రాంతిమాధవ్‌ సినిమాకి. తమిళంలో 25 సినిమాలు తర్వాత తమిళంలో నేను చేసిన ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీ ‘కణ’. లాస్ట్‌ ఇయర్‌ డిసెంబర్‌ 21 రిలీజ్‌ అయ్యి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. దానికి కారణమైన నిర్మాత శివకార్తికేయన్‌, దర్శకుడు అరుణ్‌ రాజా కామరాజ్‌కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 25 సినిమాలు తర్వాత ఎలాగైతే ‘కణ’ అవకాశం వచ్చిందో.. తెలుగులో తొలి సినిమానే ‘కౌసల్య కృష్ణమూర్తి’గా వచ్చింది. ఇలాంటి లాంచ్‌ అందరికీ దొరకదు. ఒక మంచి ప్రొడ్యూసర్‌ ఉంటేనే ఆ సినిమాకి ప్రమోషన్స్‌, రిలీజ్‌లు బాగుంటాయి. నా మీద ఉన్న నమ్మకంతో రామారావు గారు సినిమాను ఓన్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈరోజు మా నాన్న గారు ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యేవారు. మా నాన్నగారి రూపంలో రామారావుగారు నాతో ఉన్నారు. ఒరిజినల్‌ కంటెంట్‌ మిస్‌ కాకుండా డైరెక్టర్‌ భీమినేని కథకు వందశాతం న్యాయం చేశారు. దిబూ గారు మంచి మ్యూజిక్‌తో పాటు ఆర్‌.ఆర్‌ ఇచ్చారు. తమిళంలో కంటే తెలుగులో ఇంకా మంచి హిట్‌ అవుతుంది. విజయ్‌ ఫ్యాన్స్‌ అందరూ సినిమా చూసి పెద్ద హిట్‌ చేయండి’’ అన్నారు. 

నటకిరిటీ డా.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఏ నటుడికైనా తన కెరీర్లో ఎన్ని సినిమాలు చేశామనే దానికంటే, ఎన్ని సినిమాలు గుర్తున్నాయి, ఎన్ని క్యారెక్టర్స్‌ గుర్తుండేలా తీశామనేదే లెక్క అని నా అభిప్రాయం. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌లో ‘ఛాలెంజ్‌’ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఇదే బ్యానర్‌లో ‘పుణ్యస్త్రీ’లో అద్భుతమైన పాత్ర చేశాను. ఇదే కంపెనీలో ‘ముత్యమంతముద్దు’ అనే సినిమా చేశాను. ఎందుకంటే టేస్ట్‌ అనేది ప్రొడ్యూసర్‌ దగ్గర నుండే స్టార్ట్‌ కావాలి. అది రామారావుగారిలో ఉంది. ఆయన ఎప్పటికీ నిలిచిపోయే నిర్మాత. నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. ఈ సినిమా విషయానికి వస్తే పాత్రలకు తగిన నటులే దొరికారు. నటులను ఎంపికకు భీమినేని శ్రీనివాసరావు, రామారావుగారే కారణం. ఒరిజినల్‌గా ఉన్న అన్ని అంశాలను మిస్‌ కాకుండా, అంత కంటే ఎక్కువగానే ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు. 

నటుడు కార్తీక్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘నా మొదటి సినిమానే క్రియేటివ్‌ కమర్షియల్స్‌లో రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన కె ఎస్‌ రామారావు గారికి, వల్లభ గారికి, భీమినేని గారికి థాంక్స్‌. ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక అందరూ నన్ను కౌసల్య కృష్ణమూర్తి కార్తీక్‌ అని పిలుస్తారు అనుకుంటున్నాను’’ అన్నారు. 

నిర్మాత పోకూరి బాబూరావు మాట్లాడుతూ.. ‘‘కె.ఎస్‌.రామారావుగారు 40 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. ఎందరో స్టార్‌లను మెగాస్టార్‌లుగా చేసినా ఘనమైన నిర్మాత. ఎన్నో సెన్సషనల్‌ మూవీస్‌ తీశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంది నిర్మాతలు వచ్చారు... కానీ ఆయన మాత్రం సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన నిర్మాణ సారథ్యంలో కౌసల్య కృష్ణమూర్తి తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో సీరియల్‌ నరసింహరావు, లిరిసిస్ట్‌ రాంబాబు, గాయని రోషితా సాయి, సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ పాల్గొన్నారు. 

Kousalya Krishnamurthy Pre Release Event Highlights:

Celebrities speech at Kousalya Krishnamurthy Pre Release Event

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement