Advertisementt

విజయ్‌ కోసం జాన్వీని తెస్తున్న పూరీ!

Wed 21st Aug 2019 06:46 PM
janhvi kapoor,puri jagannadh,vijay devarakonda,tollywood  విజయ్‌ కోసం జాన్వీని తెస్తున్న పూరీ!
janhvi kapoor for puri-vijay devarakonda film విజయ్‌ కోసం జాన్వీని తెస్తున్న పూరీ!
Advertisement
Ads by CJ

‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టవ్వడంతో మాంచి ఊపు మీదున్న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది కూడా. సినిమా ప్రకటన చేశారు ఓకే.. మరి హీరోయిన్ ఎవరన్న విషయం ఇంతవరకూ తెలియరాలేదు. అయితే అందాల తార.. అందానికి కేరాఫ్‌గా పేరుగాంచిన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.

వాస్తవానికి కొత్త హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేయ‌డంలో పూరి ముందుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ముంబై హీరోయిన్స్‌ను తెలుగులోకి ప‌రిచ‌యం చేసిన పూరీ.. ‘డఢక్’ సినిమాతో అందాలు ఆరబోసిన నటిగా పేరు తెచ్చుకున్న జాన్వీని పరిచయం చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారని వార్తలు వినవస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో అజిత్ చిత్రంలో నటిస్తున్నది. అయితే.. ఈ క్రమంలో తెలుగులో నటించడానికి సుముఖుత వ్యక్తం చేస్తుందా లేకుంటే సింపుల్‌గా రిజెక్ట్ చేస్తుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

janhvi kapoor for puri-vijay devarakonda film:

janhvi kapoor for puri-vijay devarakonda film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ