Advertisementt

‘అలకనంద’ కోసం ఐదు కోట్లు.. నిజమేనా!?

Wed 21st Aug 2019 04:37 PM
5crores,pooja hegde,alakanada,ala vaikunta puram lo  ‘అలకనంద’ కోసం ఐదు కోట్లు.. నిజమేనా!?
5crores For Alakanada Setup..! ‘అలకనంద’ కోసం ఐదు కోట్లు.. నిజమేనా!?
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘అల వైకుంఠపురంలో..’ సినిమా పేరును చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో కథానాయిక పూజా హెగ్డే ‘అలకనంద’ పాత్రలో కనిపించనుందనే టాక్ నడుస్తోంది. శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువతి కావడంతో ఈమె పాత్ర చాలా బాగా అట్రాక్ట్ చేసేందుకు.. ఆమె రిచ్ తనానికి తగ్గట్టుగానే సెటప్‌ కూడా చేస్తున్నారట.

అందుకే.. హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ఈ భారీ సెట్ నిర్మాణం జరుగుతోందట. ఇందుకోసం నిర్మాతలు రూ. 5 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ సెటప్‌లోనే పూజా హెగ్దేతో పాటు టబు, బొమన్ ఇరాని తదితరులపై షూట్ జరుగుతుందని సమాచారం. వ‌చ్చే నెల వ‌ర‌కు యూనిట్ షెడ్యూల్ గ్యాప్‌లో ఉంటుందట. అంతేకాదు.. ఇదే సెట్‌లోనే ఓ పాట‌ను కూడా చిత్రీకరిస్తారట. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సింందే మరి.

5crores For Alakanada Setup..!:

5crores For Alakanada Setup..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ