రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరు హీరోగా ఐదు భాషల్లో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ప్రభంజనం మొదలైపోయింది. మొన్న మేకింగ్ వీడియోతో దుమ్మురేపిన సైరా యూనిట్ నేడు సైరా టీజర్ ని ముంబైలో విడుదల చేసింది. అక్టోబర్ 2 న విడుదలకాబోతున్న సైరా నరసింహారెడ్డి ప్రమోషన్స్ ముంబై వేదికగా గ్రాండ్ గా మొదలైపోయాయి. సైరా సినిమాని రామ్ చరణ్ 250 కోట్లతో భారీగా నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ చిరు కెరీర్ లోనే సైరా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. అందుకే యావత్ దేశం మొత్తం సైరా సినిమాపై ఆసక్తి చూపడం, చారిత్రాత్మక చిత్రం కావడంతో సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక సైరా టీజర్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఈ సినిమాపై క్రేజ్ పెరగడానికి కారణం.
మరి సైరా టీజర్ చూసాక ఆ అంచనాలు అందుకోవడం సైరా కు పెద్ద విషయం కాదనిపిస్తుంది. అంతలా ఉంది సైరా టీజర్. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో పవర్ ఫుల్ గా మొదలైన టీజర్ లో చిరు లుక్స్ హైలెట్. చిరు ఉయ్యాలవాడ లుక్ లో గతంలోనే పోస్టర్స్ తో అదరగొట్టాడు. ఇప్పుడు ఎంతో ఎనర్జిటిక్ హీరోగా సైరా నరసింహారెడ్డి లుక్ లో, యాక్షన్ సీక్వెన్సెస్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇక సైరా యుద్ధ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయి. ఇక ఈ సినిమాలో నటిస్తున్న నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, అమితాబ్, జగపతి బాబు లుక్స్ కూడా కేక పుట్టించేలా ఉన్నాయి. అందరూ పవర్ ఫుల్ పాత్రలకు అడ్డాగా కనబడుతున్నారు. సైరా నరసింహారెడ్డి ఆంగ్లేయుల భరతం పట్టిన మహా వీరుడిగా.. చరిత్రలో కలిసిపోయిన వాడిలా చిరు నటన, లుక్స్, ఎనర్జీ లెవెల్స్ అన్నిటా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మేకింగ్ వీడియో కన్నా సైరా టీజర్ లోనే స్టార్స్ యొక్క పాత్రలకు ఓ క్లారిటీ కనబడుతుంది.
ఇక సినిమాకి పెట్టిన బడ్జెట్ తెర మీద నిండుగా కనబడుతుంది. కోటలు, యుద్ధ సన్నివేశాలు, భారీ నిర్మాణాల సెట్టింగ్స్ అన్ని భారీగా కనబడమే కాదు.... ఏనాడో మరుగున పడిపోయిన చరిత్రని గుర్తు చేస్తున్నాయి. ఇక చిరు ఎంతో పవర్ ఫుల్ గా గర్జించిన.... రేనాటి వీరులారా... చరిత్రలో మనం ఉండకపోవచ్చు... కానీ చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి.. అనే డైలాగ్ అయితే మెగా ఫ్యాన్స్ కి పండగే.