తన పర్సనాలిటీ విషయం పక్కన పెడితే బాలయ్య తన మేకోవర్ విషయంలో ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తూనే ఉంటాడు. ఏదొక విధంగా తన స్టైల్‌ని మార్చుకుని చాలా కొత్తగా కనిపిస్తుంటాడు బాలయ్య. లావు గురించి పక్కన పెడితే నిన్న బయటకు వచ్చిన లుక్ గురించి ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు.
మొన్నటివరకు పెద్ద మొహంతో, భీకరమైన గెడ్డంతో కనిపిస్తూ వచ్చాడు బాలయ్య. ఎన్నికలు సమయంలో ఫుల్ షేవ్ చేసి కుర్రోడిలా మారాడు. కానీ నిన్న వచ్చిన లుక్ తో ఔరా! అనేలా చేస్తున్నాడు. చిత్రమైన గడ్డం, పైకి దువ్విన క్రాఫ్ తో మిడిల్ ఏజ్డ్ లుక్ లోకి వచ్చేసాడు బాలయ్య.
ఇటువంటి స్టిల్ బాలయ్య ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ లుక్ తన కొత్త సినిమా కోసం. కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో సి కళ్యాణ్ నిర్మించే సినిమా కోసమే ఈ గెటప్, ఈ మేకోవర్ అంతా. ఇంకా లావు గురించి అయితే బాలయ్య బోయపాటికి మాట ఇచ్చాడట. తనతో సినిమా చేసే టైం కళ్ళ లావు తగ్గి స్లిమ్‌గా మారతానని. నిజంగా బాలయ్య లావు తగ్గితే ఇక నందమూరి ఫ్యాన్స్‌ని ఆపలేం.