Advertisementt

‘రణరంగం’.. అంతా శర్వానే చేశాడంటున్నారు

Tue 20th Aug 2019 05:10 PM
ranarangam,sharwanand,failure,sudheer varma,sharwanand hero,ranarangam movie  ‘రణరంగం’.. అంతా శర్వానే చేశాడంటున్నారు
Ranarangam Director and Producer angry on Hero Sharwanand ‘రణరంగం’.. అంతా శర్వానే చేశాడంటున్నారు
Advertisement
Ads by CJ

శర్వానంద్ - సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ ‘రణరంగం’. కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గత గురువారం విడుదలయ్యింది. శర్వానంద్, దర్శకుడు హను రాఘవపూడితో ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో పాటే మొదలుపెట్టిన సుధీర్ వర్మ రణరంగాన్ని.. చాలా స్లోగా షూటింగ్ చేస్తూ వచ్చాడు. మొదట్లో పెద్దగా హైప్ లేని ఈ సినిమాపై టైటిల్ అండ్ శర్వా లుక్స్ రివీల్ చేసిన తర్వాత ఓ క్రేజ్ ఏర్పడింది. ‘పడి పడి లేచే మనసు’ యావరేజ్ అయినప్పటికీ..... ఈ సినిమాపై మంచి అంచనాలే వచ్చాయి. అదే అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణరంగం మొదటి షోకే యావరేజ్ అనిపించుకున్నప్పటికీ.. మొదటి రోజు కలెక్షన్స్ వర్షం కురిపించింది.

ఇక యావరేజ్ టాక్ తో రెండో రోజు కాస్త డ్రాప్ అయిన రణరంగం కలెక్షన్స్.. ఆదివారం వచ్చేసరికి మరీ దారుణంగా పడిపోయాయి. అయితే సినిమా మీద మరీ ఇంత బ్యాడ్ ఒపీనియన్ రావడానికి శర్వానే కారణమంటూ దర్శకనిర్మాతలు గుర్రుగా ఉన్నారట. ఎందుకంటే సినిమా విడుదలైన రెండో రోజే శర్వానంద్ సినిమాలో కథ లేదు.. కేవలం స్క్రీన్‌ప్లే నచ్చి సినిమా చేసానని ప్రతిసారి చెప్పడంతో.. ప్రేక్షకుడికి సినిమా మీద ఇంట్రెస్ట్ పోయిందని... అందుకే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయని దర్శకుడు సుధీర్ వర్మ, నిర్మాతలు శర్వా మీద ఆగ్రహంగా ఉన్నారట. సినిమా ఇంకా థియేటర్స్‌లో ఉండగానే శర్వా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అవసరమా అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. మరి ఎంతగా నిజాల్ని ఒప్పుకున్నప్పటికీ.. అది మరీ రెండు మూడు రోజుల్లో చెయ్యడం కరెక్ట్ కాదు... ఒక వారం అయ్యాక తీరిగ్గా సినిమా ప్లాప్ విషయమై ముచ్చటించుకుంటే.... ఏమన్నా ఫలితం ఉండేది కదా అంటూ తలలు పట్టుకుంటున్నారట.

Ranarangam Director and Producer angry on Hero Sharwanand:

Sharwanand is the reason for Ranaranam Failure 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ