కెరీర్ పరంగా కాజల్ అగర్వాల్‌కి ఏమి అంతగా కలిసి రావడంలేదు. ఈ ఏడాది ఆమెకు టాలీవుడ్‌లో వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. మొదటి సమ్మర్‌లో సీత సినిమాతో పాటు మూడు రోజులు కిందట రిలీజ్ అయిన రణరంగం సినిమాలతో నిరాశపరిచింది కాజల్. కానీ కోలీవుడ్‌లో ఈ వీక్ రిలీజ్ అయిన ‘కోమాలి’ అనే చిత్రంతో హిట్ అందుకుంది.
ఇందులో జయం రవి హీరోగా నటించాడు. పదహారేళ్ల తర్వాత జయం రవి కోమా నుండి బయటకు వస్తాడు. వచ్చిన తరువాత పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది సినిమా. సినిమా మొత్తం కడుపుబ్బ నవ్విస్తోంది. ట్రైలర్‌కే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా సినిమాకి అయితే మంచి టాక్ వచ్చింది.
ఇందులో కాజల్ ది గ్లామర్ క్యారెక్టరే అయినప్పటికీ ఆమెకు మంచి హిట్ పడటంతో సంతోషంగా ఉండే ఉంటుంది. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 తో పాటు మరో తెలుగు సినిమా చేస్తుంది.