Advertisementt

బన్నీ సినిమాలో ఐటమ్ కోసం హాట్ భామ!

Mon 19th Aug 2019 07:13 PM
bunny,dual shades,ala vaikunthapuramlo,item song,top heroine,trivikram srinivas  బన్నీ సినిమాలో ఐటమ్ కోసం హాట్ భామ!
Who is Item Girl in Bunny and Trivikram Srinivas Movie? బన్నీ సినిమాలో ఐటమ్ కోసం హాట్ భామ!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా టైటిల్ తో పాటుగా విడుదలైన టీజర్ తో ‘అల వైకుంఠపుములో’ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా కాస్త రఫ్ లుక్ లో కనబడుతున్నాడు. గతంలో త్రివిక్రమ్‌తో చేసిన ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు హిట్ అవడంతో.. ఇప్పుడు ఈ ‘అల వైకుంఠపురములో’ సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ 2 షేడ్స్ లో కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఒకటి మిడిల్ క్లాస్ అబ్బాయిగా అయితే.. మరొకటి ఓ మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగిగా కనిపిస్తాడంటున్నారు.

ఇక చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, నివేత పేతురాజ్‌లు నటిస్తున్నారు. అలనాటి మేటి నటి టబు కూడా ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇకపోతే డీజే లో అల్లు అర్జున్ తో పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోనూ ఈ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే థియేటర్స్ లో విజిల్స్ పడడం ఖాయమంటున్నారు. 

అయితే ఈ సినిమాలో ఓ ఐటెం ప్లాన్ చేసినట్లుగానూ, ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆ ఐటెం కోసం స్పెషల్ గా ట్యూన్స్ కడుతున్నాడని సమాచారం. మరి ఈ సాంగ్ కోసం ఓ టాప్ హీరోయిన్‌ని తీసుకోవాలని త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ భావిస్తున్నారట. మాస్ ఆడియన్స్ కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న ఈ సాంగ్ లో మాస్ స్టెప్స్ ఉంటాయట. మరి ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ తో కలిసి ఆ మాస్ స్టెప్స్ వెయ్యబోయే ఆ భామ ఎవరంటూ అప్పుడే మెగా ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.

Who is Item Girl in Bunny and Trivikram Srinivas Movie?:

Bunny Dual Shades In Ala Vaikunthapuramlo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ