హైద్రాబాద్ :వినీత్ చంద్ర, దేవయానీ శర్మ జంటగా నటించిన తూనీగ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. ఆద్యంతం ఆధునిక సాంకేతిక హంగులతో నిండిన ఈ ట్రైలర్ సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోం ది. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన ప్రేమ్ సుప్రీమ్ అనే యువకుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. క్రౌండ్ ఫండింగ్ విధానంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ సదాశివుని అందించగా, సినిమాటోగ్రఫీ హరీశ్ ఎదిగ స మకూర్చారు. ఎడిటర్ గా ఆర్కే కుమార్, పోస్టర్ డిజైనర్ గా వర్థమాన డిజిటల్ ఆర్టిస్ట్ ఎంకేఎస్ మనోజ్ వ్యవహరించారు.
ప్రేమ్ పెయింటింగ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నా యి. అంతా కొత్తవారే కలిసి రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ను మ్యాంగో మ్యూజిక్ సంస్థ ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. ఈ సందర్భంగా తమకెంతో సహకరిస్తున్న అన్ని ప్రసార మాధ్యమాలకూ, ప్రచురణ మాధ్యమాలకూ చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ప్రచార సారథి రత్నకిశోర్ శంభుమహంతి నేతృత్వాన ఇప్పటికే విడుదలయిన డిజిటల్ డైలాగ్, డిజిటల్ పోస్టర్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి శ్రీకాకుళం ఫిల్మ్ క్లబ్ తరపున రమేశ్ నారాయణ్ శుభాకాంక్షలు తెలిపారు.