అడవి శేష్ - రెజీనా జంటగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఎవరు’ సినిమా గత గురువారం విడుదలై హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. క్షణం, గూఢచారి సినిమాల హిట్స్ కొట్టిన అడవి శేష్ ఎవరు సినిమాతోనూ హిట్ కొట్టేసాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు సినిమా కి బ్లాక్ బస్టర్ టాక్ పడడమే కాదు.... శేష్ కెరీర్ లోనే ఎవరు సినిమాకి మంచి ఓపెనింగ్స్ పడ్డాయి. అయితే శర్వానంద్ రణరంగంతో పోటీ పడిన అడవి శేష్ ఎవరు కి ఎంతగా హిట్ టాకొచ్చినా కలెక్షన్స్ పరంగా కాస్త కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రణరంగం సినిమాకి యావరేజ్ టాకొచ్చినా.. ఆ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకడం ఒక ఎత్తైతే.... రణరంగం సినిమాకి బిసి సెంటర్స్ ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువగా కనబడుతుంది.
ఇక శర్వానంద్ రోజుకోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రణరంగం సినిమా గురించి ముచ్చటిస్తున్నాడు. ఇక ఎవరు సినిమా కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవడం, బిసి సెంటర్స్ ఆడియెన్స్ కి ఎవరికీ అంతగా ఎక్కకపోవడం మైనస్. అందుకే ఎవరు సినిమాకి హిట్ టాకొచ్చినా.. థియేటర్స్ పెంచలేదు. ఇక ఎవరు కి థియేటర్స్ పెంచకపోయిన... బిసి సెంటర్స్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోయినా.. సినిమాకి పెట్టిన బడ్జెట్ చాలా తక్కువ కాబట్టి నిర్మాతలు సేఫ్ అవుతారు కానీ.. భారీ లాభాలైతే రావు అని అంటున్నారు.
అయితే ఎవరు కలెక్షన్స్ పెద్దగా రాకపోవడానికి కారణం అడవి శేష్ కి ఓ మాస్ ఫాలోయింగ్ కానీ, ఓ లవర్ బాయ్ ఇమేజ్ కానీ లేకపోవడం ఒక కారణముగా చెబుతున్నారు. ఇక కేవలం అడవి శేష్ ప్రతిసారి ఒకే రకమైన ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు కానీ... అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోవడం లేదనే అంటున్నారు.