టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఫోన్ కెమెరా ఉంటే చాలు సినిమా తీసేస్తారన్న విషయం విదితమే. ఇది అక్షర సత్యం చేసి చూపించారు ఆర్జీవీ. మరీ ముఖ్యంగా ఈయన సినిమాల్లో కొత్త కొత్త వాళ్లను పరిచయం చేయడం.. వారిని స్టార్లను కూడా పరిపాటిగానే వస్తోంది. ఇందుకు ప్రత్యేకించి మరీ ఉదాహరణలు చెప్పనక్కర్లేదు. ఆర్జీవీ తెరకెక్కించే సినిమాల్లో దాదాపు కొత్తవాళ్లే ఉంటారు. అయితే ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే సాంగ్ కూడా వదిలేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నటించడానికి డూప్ నాయకులు కావలెను అని నోటిఫికేషన్ ఇచ్చారు ఆర్జీవీ. డూప్ ఎవరెవరు..? అనే జాబితాను సైతం ఆర్జీవీ వదిలేశాడు. ప్రధాని మోదీ, అమిత్ షా, నారా చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా బ్రాహ్మణి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, స్పీకర్ తమ్మినేని సీతారాం, నారా లోకేష్, అచ్చయ్య నాయుడు, నారా దేవాన్ష్, దేవినేని ఉమా మహేశ్వర్ రావు, కేశినేని నాని, కోడెల శివప్రసాద్ రావు, ఘంటా శ్రీనివాసరావు, సుజనా చౌదరి, పోలీసు అధికారి గౌతమ్ సవాంగ్‌ల కోసం వెతుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు. సో.. ఆర్జీవీ నోటిఫికేషన్ అయితే ఇచ్చేశాడు.. ఇక సినిమాల్లో నటించే డూప్‌లు కాస్కోవాల్సిన టైమ్ వచ్చేసింది.. కాస్కోండిక.
ఇప్పటికే తన సినిమాల కోసం ఇలా నటుల కోసం నోటిఫికేషన్ వదిలినప్పుడు కొన్ని రోజుల్లోనే దొరికిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి జాబితా కాస్త పెద్దది కాబట్టి వీళ్లంతా ఆర్జీవీకి ఎప్పుడు దొరుకుతారో ఏమో..? అసలు ఇది ఎంత వరకు సాధ్యం..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.