Advertisementt

జాన్వీ ఫొటో చూసి శ్రీదేవి ఫ్యాన్స్ షాక్!!

Sun 18th Aug 2019 06:18 PM
sridevi fans,shock,janhvi kapoor,bollywood  జాన్వీ ఫొటో చూసి శ్రీదేవి ఫ్యాన్స్ షాక్!!
Sridevi Fans Shocked While Seen Janhvi’s Pic జాన్వీ ఫొటో చూసి శ్రీదేవి ఫ్యాన్స్ షాక్!!
Advertisement
Ads by CJ

అందాల నటి శ్రీదేవి వారసత్వం పునికిపుచ్చుకోవడానికి జాన్వీ కపూర్ చేస్తున్న భగీరథ ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ‘ధఢక్’ సినిమాలో నటించి మెప్పించిన మంచి మార్కులు కొట్టేసిన ఈ జూనియర్ శ్రీదేవి.. మరో సినిమా కోసం కసరత్తులు చేస్తోంది. అయితే ఈ భామ ‘కార్గిల్ గర్ల్’, ‘రూహ్ ఆఫ్జా’చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం జాన్వీ బాడీ ఫిట్‌నెస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిగో ఫొటోలో చూస్తున్నట్లుగా డైలీ ఇలా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోంది.

జాన్వీకి నమ్రతా పురోహిత్ అనే జిమ్ ట్రైనర్ బాడీ ఫిట్‌ చేస్తోంది. జిమ్‌కు వెళ్లిన జాన్వీని ఎవరోకానీ కెమెరాతో ఓ పిక్‌ను క్లిక్ మనిపించి.. నెట్టింట పెట్టడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. ఈ ఫొటో చూసిన శ్రీదేవి అభిమానులు, సినీ ప్రియులు వామ్మో.. జాన్వికి ఇంత ఫిట్నెస్ ఉందా..? అంటూ షాకవుతున్నారు. మొదటి సినిమాతో మంచి టాక్ తెచ్చుకున్న జాన్వీ.. ఈ రెండు చిత్రాలతో సినీ ప్రియులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

Sridevi Fans Shocked While Seen Janhvi’s Pic:

Sridevi Fans Shocked While Seen Janhvi’s Pic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ