Advertisementt

అల్లు అర్జున్ సినిమాలో మెగా డాటర్ కీలక పాత్ర!

Sun 18th Aug 2019 12:28 PM
niharika,key role,allu arjun,syraa   అల్లు అర్జున్ సినిమాలో మెగా డాటర్ కీలక పాత్ర!
Niharika Key Role In Allu Arjun’s Movie! అల్లు అర్జున్ సినిమాలో మెగా డాటర్ కీలక పాత్ర!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. అంతేకాదు చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు..? అనేదానిపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. అయితే వారి పాత్రలను మాత్రమే పరిచయం చేయాల్సి ఉంది. మరోవైపు త్రివిక్రమ్ ఇప్పటికే షూటింగ్ షురూ చేసేశాడు.

ఇక అసలు విషయానికొస్తే.. హీరోయిన్‌గా కాలం కలిసిరాని మెగా డాటర్ నిహారిక ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అయితే నిహారిక ఏ పాత్రలో నటిస్తుంది..? ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అల్లుఅర్జున్‌కు చెల్లెలి పాత్రలో నిహారిక నటిస్తోందని తెలుస్తోంది. అయితే నిహారిక పాత్రే ఈ సినిమాకు కీలకం కానుందని సమాచారం.

నిహారిక హీరోయిన్‌గా నటించిన ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యాకాంతం’ చిత్రాలు ఆశించినంత ఫలితాలు రాకపోయే సరికి.. ప్రస్తుతం వెబ్‌సీరిస్‌కే మెగా డాటర్ పరిమితమైంది. అంతేకాదు.. నిహారిక తన బాబాయ్ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలో నిహాకరిక దర్శనమిచ్చిన విషయం విదితమే.

Niharika Key Role In Allu Arjun’s Movie!:

Niharika Key Role In Allu Arjun’s Movie!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ