Advertisementt

త్వరలోనే సెట్స్‌పైకి ‘నాగ్’ సినిమా.. ఎవరికోసమో!

Sun 18th Aug 2019 12:18 AM
nag aswin,mahanati,evade subramanyam,tollywood  త్వరలోనే సెట్స్‌పైకి ‘నాగ్’ సినిమా.. ఎవరికోసమో!
Nag Aswin prepairing Story For Whom!? త్వరలోనే సెట్స్‌పైకి ‘నాగ్’ సినిమా.. ఎవరికోసమో!
Advertisement
Ads by CJ

కేవలం రెండే రెండు చిత్రాలతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క నాగ్ అశ్విన్ మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘ఎవడే సుబ్రమణ్యం’ తో అందరి దృష్టిని ఆకర్షించి.. రెండవ చిత్రం ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల గుండెల్లో నిలిచిపోయారు. ఇక పాయింట్‌కు వస్తే.. మూడో సినిమా నాగ్ ఎప్పుడు తీస్తారు..? ఏ బ్యాక్ డ్రాప్‌లో సినిమా తీస్తారు..? అనేదానిపై ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయన తన మూడో సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. ‘నా తదుపరి చిత్రం కోసం స్ర్కీన్ ప్లే చేస్తున్నాను. అది ఒరిజనల్ స్టోరీ కావడంతో చాలా ఆలస్యం అవుతోంది.. టైమ్ చాలా తీసుకుంటోంది. నేను అసలే స్లో.. ఒరిజినల్ స్టోరీ కావడంతో ఇంకాస్త ఆలస్యం అవుతోంది. వాస్తవానికి సినిమాకు సినిమాకు మధ్య నేను చాలా గ్యాప్ తీసుకుంటాను. త్వరలోనే నా తర్వాతి చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.. ఆ చిత్రం మీ అందరి మెప్పు పొందుతుంది’ అని ఈ సందర్భంగా నాగ్ చెప్పుకొచ్చారు. మరి నాగ్ సినిమా ఎలా ఉండబోతోందో..? ఎవరి కోసం ఆ కథ రాస్తున్నాడో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

Nag Aswin prepairing Story For Whom!?:

Nag Aswin prepairing Story For Whom!?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ