Advertisementt

‘వాల్మీకి’లో పూజ ఏం చేస్తోంది!!

Sat 17th Aug 2019 07:43 PM
valmiki,harish shankar,varun tej,pooja hegde  ‘వాల్మీకి’లో పూజ ఏం చేస్తోంది!!
news about valmiki Heroine ‘వాల్మీకి’లో పూజ ఏం చేస్తోంది!!
Advertisement
Ads by CJ

తమిళ సినిమా జిగర్తాండ చిత్రానికి తెలుగులో రీమేక్‌గా వస్తున్న చిత్రం ‘వాల్మీకి’ యొక్క టీజర్ నిన్ననే రిలీజ్ అయ్యి సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఇందులో వరుణ్ తేజ్ ఫుల్ గడ్డంతో, ఉంగరాల జుట్టుతో, నల్లని బట్టలతో కరుడుగట్టిన రౌడీలా భయంకరంగా ఉన్నాడు. ఇందులో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.

ఒరిజినల్‌గా తమిళ చిత్రంలో బాబీ సింహ చేసిన పాత్రను వరుణ్ చేస్తుండగా, హీరో సిద్దార్ద్ చేసిన ఫిలిం డైరెక్టర్ పాత్రను అధర్వ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశర్యం కలిగించే అంశం ఏంటంటే అధర్వ లవర్‌గా మృణాళిని తీసుకున్నారు. మరి పూజా హెగ్డేని ఏ పాత్ర కోసం తీసుకున్నారో అనేది ఆసక్తికర విషయం. 

ఎందుకంటే ఒరిజినల్ మూవీ జిగర్తాండలో బాబీ సింహ పాత్రకు హీరోయిన్ ఉండదు. మరి ఇక్కడ వరుణ్ తేజ్ కి జోడిగా పూజ ని తీసుకున్నారా? లేదా ఆమె కోసం హరీష్ శంకర్ సపరేట్‌గా పాత్ర ఏమైనా రాశాడా..? అనేది ఆసక్తికరం. ఈ మూవీ అన్ని అంచనాల మధ్య వచ్చే నెల 13న విడుదల కానుంది.

news about valmiki Heroine:

news about valmiki Heroine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ