Advertisementt

‘4 బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె..’

Sat 17th Aug 2019 01:08 PM
varun tej konidela,valmiki,teaser  ‘4 బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె..’
Varun Tej Konidela’s Valmiki Teaser Out ‘4 బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె..’
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మాస్‌ కమర్షియల్‌ సినిమాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీ ‘వాల్మీకి’. ఇటీవల తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘జిగర్తాండ’ అనే సినిమాకు అఫీషియల్‌ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్‌ టీజర్‌ ఇప్పటికే యూట్యూబ్‌లో రిలీజయి వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ని సంపాదించింది. ఇక ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌‌ను స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్‌ అయ్యింది.

‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అధర్వ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ స్టార్ట్‌ అవుతుంది. వరుణ్‌ స్టైలిష్‌ లుక్‌తో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నాడు. సిగరెట్‌ తాగుతూ వరుణ్‌ నడుస్తూ వచ్చే సీన్‌ బాగుంది. టీజర్‌ చూస్తుంటే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలువనున్నాయని తెలుస్తుంది. 

‘అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె’ అని వరుణ్‌ తేజ్‌ ఇంటెన్స్‌ లుక్‌ చెప్పే డైలాగ్‌తో 51 సెకండ్ల నిడివిగల టీజర్‌ ముగుస్తుంది. టీజర్‌ చూస్తుంటే సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా..? అనే ఇంట్రెస్ట్‌ క్రేయేట్‌ చేశారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. వరుణ్‌ ఫస్ట్‌ మూవీ ‘ముకుంద’లో హీరోయిన్‌‌గా నటించిన పూజ హెగ్డే, మరొక్కసారి ఈ సినిమాలో ఆయనతో నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుణ్‌ ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్లో నటిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సెప్టెంబర్‌ 13న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నారు.

Varun Tej Konidela’s Valmiki Teaser Out:

Varun Tej Konidela’s Valmiki Teaser Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ