Advertisementt

ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ పంద్రాగస్ట్ సర్‌ప్రైజ్

Fri 16th Aug 2019 04:45 PM
jr ntr,abhay ram,independence day,special still  ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ పంద్రాగస్ట్ సర్‌ప్రైజ్
Jr NTR Son Abhay Ram Independence Day Special Still ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ పంద్రాగస్ట్ సర్‌ప్రైజ్
Advertisement
Ads by CJ

పండుగల పబ్బాలు వస్తే చాలు.. సెలబ్రిటీలు తమ అభిమానులకు ఏదో ఒక సర్‌ఫ్రైజ్ ఇస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌ హీరో హీరోయిన్లకయితే ఇలాంటి సర్‌ఫ్రైజ్‌లకు కొదువే ఉండదు. ఇక అసలు విషయానికొస్తే.. పంద్రాగస్టు నాడు జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక సర్‌ఫ్రైజ్ ఇస్తారని అభిమానులు భావించారు. అయితే ఆ సర్‌ఫ్రైజ్ తన కుమారుడి రూపంలో ఇచ్చేశాడు.

పంద్రాగస్టు సందర్భంగా తన కుమారుడు ‘అభయ్ రామ్’ కొత్త లుక్‌ని జూనియర్ రివీల్ చేశాడు. కాగా.. ఎన్టీఆర్ ఈ సర్‌ఫ్రైజ్ ఫొటోలో అభయ్.. బుల్లి సుభాష్ చంద్రబోస్ వేషధారణలో సెల్యూట్ చేస్తున్నాడు. ఈ లుక్ చూసిన జూనియర్ వీరాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వామ్మో.. అభయ్‌లో అప్పుడే నటుడయ్యే లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని కితాబిస్తున్నారు. మరికొందరైతే.. RRR నుంచి తారక్ లుక్ రివీలవుతుందని భావించాం.. పోన్లే.. అభయ్ లుక్‌తోనే సరిపెట్టుకున్నారేంటి.. అని సంతృప్తిని.. ఇంకాసిత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

Jr NTR Son Abhay Ram Independence Day Special Still:

Jr NTR Son Abhay Ram Independence Day Special Still  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ