టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో నటించిన ‘బాహుబలి’ 1,2 సీరిస్‌లు ఏ రేంజ్‌లు రికార్డులు బద్దలు చేశాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘బాహుబలి’ తెలుగు ఖ్యాతి ఏంటో ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు.. ఈ రికార్డును ఇంతవరకూ ఏ తెలుగు సినిమా కూడా బ్రేక్ చేయలేక పోయిందంటే అర్థం చేస్కోండి. అయితే ‘నాకు నేనే సాటి.. నా రికార్డులు నేనే బద్ధలు కొట్టుకుంటా’ అని ‘సాహో’తో ప్రభాస్ వచ్చేస్తున్నాడు.
ఇటీవల ‘సాహో’ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం విదితమే. అదిరిపోయే భారీ యాక్షన్స్‌తో, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్‌తో ఎంతగానో వేచిచూస్తున్న అభిమానులను ప్రభాస్ ఫిదా చేశాడు. అయితే ఇక ఈ ట్రైలర్ బాహుబలి రికార్డ్స్‌ను బద్దలు కొట్టడం విశేషమని చెప్పుకోవచ్చు.
మొత్తం నాలుగు భాషల్లో రిలీజైన ‘బాహుబలి’ 48 గంటల్లో 65 మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ఇప్పటి వరకూ ఈ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. అయితే ‘సాహో’ మాత్రం 48 గంటల్లో 70 మిలియన్ వ్యూస్ సాధించింది. అంటే ప్రభాస్ ‘బాహుబలి’ని ‘సాహో’గా వచ్చి రికార్డ్ బద్దలు చేసేశారన్న మాట. టీజర్ వరకు ఓకే.. సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో మరి వేచి చూడాల్సిందే.