టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల టాలీవుడ్‌కు దూరమై చెన్నైకి చెక్కేసి అక్కడే ఉంటూ సినిమాల్లో అవకాశం దక్కించుకుంటోంది.
అయితే తాజాగా జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ వ్యహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ పవన్‌పై విమర్శల వర్షం కురిపించింది. ‘పేకాట ఆడేవాళ్లకు మద్దతు ఇవ్వడం ఏంట్రా?.. ఏంట్రా గొడవ రాజోలులో తోలు తీసేయండి.. పనిలో పనిగా ఈ పవన్ కళ్యాణ్‌ని కూడా లోపల ఏసేయాల్సింది’ అని శ్రీరెడ్డి పోలీసులకు ఉచిత సలహా ఇచ్చింది.
అంతటి ఆగని ఈ హాట్ బ్యూటీ.. ‘ఈ మధ్య పీకే ఫేస్ చూసారా?.. మైక్ పేడితే ఉత్సా ..మేకపోతు గాంబీర్యం నటిస్తున్నాడు..జగన్ అనాలంటే ప్యాంటులో.. ***పాపం’ అని పవన్‌పై విమర్శలు గుప్పించింది. శ్రీ రెడ్డి విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.