Advertisementt

‘నాని’స్‌.. ‘గ్యాంగ్‌ లీడర్‌’ రెండో పాట విడుదల

Thu 15th Aug 2019 09:33 PM
nani,gang leader,second song,hoyna hoyna  ‘నాని’స్‌.. ‘గ్యాంగ్‌ లీడర్‌’ రెండో పాట విడుదల
Nani’s Gang Leader Second Song To Be Out ‘నాని’స్‌.. ‘గ్యాంగ్‌ లీడర్‌’ రెండో పాట విడుదల
Advertisement
Ads by CJ

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం‘నాని’స్‌.. ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ‘రారా.. జగతిని జయించుదాం..’ అంటూ సాగే మొదటి పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ అలరించడానికి రెడీ అవుతున్న ‘నాని’స్‌.. ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రంలోని ‘వేరే కొత్త భూమిపై ఉన్నానా.. ఏదో వింత రాగమే విన్నానా.. హోయ్‌నా.. హోయ్‌నా..హోయ్‌నా..’ అంటూ సాగే రెండో పాటను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్‌ 15న విడుదల చేశారు. 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్‌.ఎక్స్‌.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Nani’s Gang Leader Second Song To Be Out:

Nani’s Gang Leader Second Song To Be Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ