Advertisementt

అల్లు అర్జున్- త్రివిక్రమ్‌ల ‘అల వైకుంఠపురములో’...

Thu 15th Aug 2019 09:21 PM
stylish star allu arjun,trivikram,ala vykuntapuram lo,harika and hassine creations  అల్లు అర్జున్- త్రివిక్రమ్‌ల ‘అల వైకుంఠపురములో’...
Stylish Star Allu Arjun-Trivikram ‘Ala Vykuntapuram lo’ got huge Response.. అల్లు అర్జున్- త్రివిక్రమ్‌ల ‘అల వైకుంఠపురములో’...
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పేరును ‘అల వైకుంఠపురములో’ గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ రోజు ఉదయం విడుదల చేశారు. హీరోగా అల్లు అర్జున్‌కు ఇది 19 వ చిత్రం.. కాగా, అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో మూడో చిత్రం. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాల్లో, అటు ప్రేక్షక వర్గాల్లోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు పెద్ద నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తుండడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.

‘అల వైకుంఠపురములో’ ని తారలు

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. 

‘అల వైకుంఠపురములో...’ టైటిల్ మేనియా...

సాధారణంగా త్రివిక్రమ్ చిత్రాల టైటిల్స్ కి క్రేజ్ బాగా ఎక్కువ. అలాంటిది అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎలాంటి టైటిల్ పెట్టనున్నారా..? అనే ఆసక్తి బాగా పెరిగింది. అందరి అంచనాలకు మించిన మంచి టైటిల్ కుదరడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉన్నారు. సినిమా కథకు సరిగ్గా సరిపోవడం... అల్లు అర్జున్ ఇమేజ్ కు ఏమాత్రం తీసిపోని ఈ టైటిల్ తో సినిమాకు మరింత బజ్ పెరిగింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర టైటిల్ కూడా ఫెస్టివల్ మూడ్ కి సరిగ్గా సరిపోవడం కలిసి వచ్చే మరో అంశం.  

స్టైలిష్ స్టార్ చెప్పిన ‘ఇవ్వలా.. వచ్చింది’ డైలాగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ 

టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ని కూడా ‘అల... వైకుంఠపురములో’ చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చివరి లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన గ్యాప్ ఇవ్వలా .. వచ్చింది అనే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ అభిమానులు సైతం ఈ డైలాగ్ తమకు ఫుల్ కిక్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క డైలాగ్ తోనే ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేశారు.

‘అల... వైకుంఠపురములో’ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 

ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే కుటుంబ సమేతంగా థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ కి సౌత్ ఇండియా సినీ లవర్స్ ఫిదా అవుతారు.  అల్లు అర్జున్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి, త్రివిక్రమ్ మాటల తూటాలు కలిస్తే  ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లోని కామెడీనే ఇందుకు ఉదాహరణ. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వీరిద్దరూ అందించనున్నారు.

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,  సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి:  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్ 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు).                           

Stylish Star Allu Arjun-Trivikram ‘Ala Vykuntapuram lo’ got huge Response..:

Stylish Star Allu Arjun-Trivikram ‘Ala Vykuntapuram lo’ got huge Response..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ