Advertisementt

భారత సైనికులకు ‘సరిలేరు నీకెవ్వరు’ శుభాకాంక్షలు

Thu 15th Aug 2019 09:12 PM
sarileru neekevvaru,tribute,soldiers,superstar mahesh babu  భారత సైనికులకు ‘సరిలేరు నీకెవ్వరు’ శుభాకాంక్షలు
Sarileru Neekevvaru Title Song A tribute to soldiers భారత సైనికులకు ‘సరిలేరు నీకెవ్వరు’ శుభాకాంక్షలు
Advertisement
Ads by CJ

‘భగభగభగ మండే నిప్పుల వర్షమొచ్చినా... జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు... ఫెళఫెళఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా.. వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు.... సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్ళే రహదారికి జోహారూ.. సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు...’ అంటూ భారత సైనికులకు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్‌ వార్‌, 1984లోని సియాచెన్‌ కాన్‌ఫ్లిక్ట్‌, 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం, 2016లో సర్జికల్‌ స్ట్రైక్‌లో పాల్గొన్న సైనికుల ధైర్య సాహసాలను శ్లాఘిస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్‌ సాంగ్‌తో భారత సైనికులకు శుభాకాంక్షలు తెలియజేసింది చిత్ర యూనిట్‌. 

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ పనిచేస్తున్న సాంకేతిక వర్గం.

Sarileru Neekevvaru Title Song A tribute to soldiers:

Sarileru Neekevvaru Title Song A tribute to soldiers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ